టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న సమయంలో విడుదలైన ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka) సినిమా ఆయనకు మళ్లీ జోష్ తీసుకువచ్చింది. నవంబర్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది.
ఈ చిత్రంలో రామ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్షే నటించి ఆకట్టుకున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఇందులో స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
కథ మొత్తం ఒక హీరో-అభిమాని మధ్య ఉన్న బంధాన్ని ఆధారంగా సాగుతుంది. ఉపేంద్ర ఓ స్టార్ హీరో సూర్యగా, రామ్ అతని వీరాభిమాని సాగర్‌గా నటించారు. హీరో కోసం అభిమానిగా రామ్ ఎంత దూరం వెళ్తాడు? ఆ ప్రయాణంలో ఏ సమస్యల్లో చిక్కుకుంటాడు? చివరకు అతని పరిస్థితి ఏమవుతుంది? అనేదంతా దర్శకుడు భావోద్వేగంగా చూపించారు.
ఇప్పుడేమో ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో భాగంగా.. ఉపేంద్ర పోషించిన సూర్య పాత్రను మొదట నందమూరి బాలకృష్ణకు ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కానీ బాలయ్య గారి రాజకీయ బిజీ షెడ్యూల్, వరుస సినిమాలు.. ఇవన్నీ ప్రభావం చూపడంతో ఈ కథను చేయలేకపోయారని తెలిసింది.
దీంతో ఆ పాత్ర ఉపేంద్రకు వెళ్లింది. కథ విన్న వెంటనే ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ బాలయ్య ఈ సినిమాలో నటించి ఉండి ఉంటే రామ్-బాలయ్య కాంబినేషన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసేదో అనేది ఫ్యాన్స్ మధ్య పెద్ద డిస్కషన్ అవుతోంది.





