HomeMovie News Teluguప్రముఖ మహిళా దర్శకురాలు కన్నుమూత..!

ప్రముఖ మహిళా దర్శకురాలు కన్నుమూత..!

ప్రముఖ మహిళా దర్శకురాలు బి. జయ (54) ఇక లేరు.

వివరాల్లోకి వెళితే, నిన్న రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆమె స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. బి. జయ గారి భర్త ప్రముఖ పీ.ఆర్.ఓ బి.ఏ రాజు.

జయ తెలుగు ఇండస్ట్రీలో ముందుగా ఒక విలేకరిగా అడుగుపెట్టారు, ఒక ప్రముఖ పత్రికకి ఫిలిం ఎడిటర్ గా కూడా పనిచేశారు. ఇక 2003లో ఆమె తొలిసారిగా చంటిగాడు సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు, ఇప్పటిదాకా ఆమె తన కెరీర్ లో 6 చిత్రాలకి దర్శకత్వం వహించారు. ఆమె ఆఖరి చిత్రం వైశాఖం పోయిన ఏడాది విడుదలైంది.

ఆమె అకాలమృతికి తెలుగు ఇండస్ట్రీతో పాటు తెలుగు సినీ జర్నలిస్టులు కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈ విషాదకర సమయంలో జయ గారికి వారి కుటుంబానికి మా www.iQlikmovies.com తరపున తీవ్ర సంతాపం తెలియచేస్తున్నాము.

You May Like This
- Advertisment -spot_img

Most Popular