HomeMovie News Teluguవారణాసి టైటిల్ మార్పు.. కొత్త పేరుతో న్యూ ట్విస్ట్!

వారణాసి టైటిల్ మార్పు.. కొత్త పేరుతో న్యూ ట్విస్ట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా భారీ ప్రాజెక్ట్ “వారణాసి” పై ప్రారంభం నుంచే భారీ హైప్ కొనసాగుతోంది. అయితే టైటిల్ ప్రకటించిన తర్వాత అనుకోని సమస్య ఎదురుకాగా, ఇప్పుడు ఆ వివాదానికి క్లియర్ సొల్యూషన్ దొరికింది.

“వారణాసి” అనే టైటిల్‌ను పెద్ద ఈవెంట్‌లో ప్రకటించిన వెంటనే, రామ బ్రహ్మ హనుమ క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థ ఈ పేరును తామే ముందే రిజిస్టర్ చేసుకున్నట్టు వెల్లడించింది. ఆ సంస్థకు చెందిన దర్శకుడు సీహెచ్‌. సుబ్బారెడ్డి కూడా ఇదే పేరుతో సినిమా చేయనున్నట్లు చెప్పడంతో, టైటిల్‌పై చట్టపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం కనిపించింది.

దీంతో రాజమౌళి టీమ్ తెలుగులో టైటిల్ మార్పుపై ఆలోచన ప్రారంభించింది.

తాజా సమాచారం ప్రకారం.. తెలుగు వెర్షన్‌లో మాత్రమే టైటిల్ మార్పు చేసే అవకాశం బలంగా కనిపిస్తోంది. కొత్త పేరుగా “రాజమౌళి వారణాసి” ను పరిశీలిస్తున్నారట.

ఇతర భాషల్లో.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం.. మునుపటి టైటిల్ “వారణాసి” నే కొనసాగించనున్నారు.

అంటే టైటిల్ మార్చడం పూర్తిగా కాదు.. తెలుగులో మాత్రమే చిన్న మార్పుతో సమస్యను క్లియర్ చేయాలనుకుంటున్నారని టాక్.

ఈ చిత్రం ఒక భారీ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతోంది. గ్లోబ్- ట్రాటింగ్, టైమ్ – ట్రావెల్, వివిధ కాలాల్లో జరిగే కథ అనే యూనిక్ కాన్సెప్ట్‌తో సినిమా రూపొందుతోందని సమాచారం.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో మహేష్ కొత్త లుక్, టైటిల్ మరియు టీజర్‌ను విడుదల చేస్తూ భారీ హైప్ సృష్టించారు.

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్.. ఈ ముగ్గురు నేషనల్ లెవెల్ స్టార్స్ కలిసి రావడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.

సినిమాను 2027 సమ్మర్‌లో గ్రాండ్‌గా విడుదల చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. రాజమౌళి ఇప్పటికే షూటింగ్ పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు.

టైటిల్ వివాదం కారణంగా కొంత గందరగోళం వచ్చినా, రాజమౌళి టీమ్ స్మార్ట్‌గా స్పందించి సమస్యను సాఫీగా పరిష్కరించినట్లు కనిపిస్తోంది. “వారణాసి” అనే టైటిల్‌కి ఉన్న పవర్, మహేష్ – రాజమౌళి కాంబినేషన్ కలిస్తే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించడం ఖాయం అని అభిమానులు నమ్ముతున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular