కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా పలు కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడినప్పటికీ, చివరకు ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం వరుస అప్డేట్స్తో సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. తాజాగా హీరో యష్ తన సోషల్ మీడియా వేదికగా ‘టాక్సిక్’ ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.
‘కౌంట్‌డౌన్ బిగిన్స్’ అంటూ ఆగస్టు 8న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో యష్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచగా, ట్రైలర్లో కథ, యష్ పాత్ర, యాక్షన్ ఎపిసోడ్లపై మరింత స్పష్టత రానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని సహకారంతో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఆగస్టు 8న విడుదల కానున్న ‘టాక్సిక్’ ట్రైలర్ కోసం సినీ అభిమానులు, పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





