HomeTeluguఆంధ్రా కింగ్ తాలూకా.. ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో..?

ఆంధ్రా కింగ్ తాలూకా.. ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో..?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న సమయంలో విడుదలైన ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka) సినిమా ఆయనకు మళ్లీ జోష్ తీసుకువచ్చింది. నవంబర్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ తెచ్చుకొని బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది.

ఈ చిత్రంలో రామ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్షే నటించి ఆకట్టుకున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఇందులో స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

కథ మొత్తం ఒక హీరో-అభిమాని మధ్య ఉన్న బంధాన్ని ఆధారంగా సాగుతుంది. ఉపేంద్ర ఓ స్టార్ హీరో సూర్యగా, రామ్ అతని వీరాభిమాని సాగర్‌గా నటించారు. హీరో కోసం అభిమానిగా రామ్ ఎంత దూరం వెళ్తాడు? ఆ ప్రయాణంలో ఏ సమస్యల్లో చిక్కుకుంటాడు? చివరకు అతని పరిస్థితి ఏమవుతుంది? అనేదంతా దర్శకుడు భావోద్వేగంగా చూపించారు.

ఇప్పుడేమో ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో భాగంగా.. ఉపేంద్ర పోషించిన సూర్య పాత్రను మొదట నందమూరి బాలకృష్ణకు ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కానీ బాలయ్య గారి రాజకీయ బిజీ షెడ్యూల్‌, వరుస సినిమాలు.. ఇవన్నీ ప్రభావం చూపడంతో ఈ కథను చేయలేకపోయారని తెలిసింది.

దీంతో ఆ పాత్ర ఉపేంద్రకు వెళ్లింది. కథ విన్న వెంటనే ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ బాలయ్య ఈ సినిమాలో నటించి ఉండి ఉంటే రామ్-బాలయ్య కాంబినేషన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసేదో అనేది ఫ్యాన్స్ మధ్య పెద్ద డిస్కషన్ అవుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular