అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్తను అందించింది. భారత పౌర విమానయాన శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అయ్యప్ప భక్తులు ఇరుముడితోనే నేరుగా విమానంలో ప్రయాణం చేయడానికి అనుమతి ఇచ్చింది. శబరిమల యాత్రలో భక్తులకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని తన ఎక్స్ (Twitter) ద్వారా ప్రకటించారు.
స్వామియే శరణం అయ్యప్ప!
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) November 28, 2025
శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ, భక్తులు ఇరుముడి ని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు మా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది అని తెలియజేయడానికి… pic.twitter.com/QT6JGV45Ng
“శబరిమల యాత్రలో పాల్గొనే అయ్యప్ప స్వాములు ఇరుముడితో విమానంలో ప్రయాణించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఇరుముడికి ఉన్న పవిత్రత, భక్తుల భావోద్వేగాలు, సంప్రదాయాలను గౌరవించే దిశగా తీసుకున్న నిర్ణయం ఇది.”
“భక్తుల ఆచారాలకు ఎలాంటి భంగం కలగకుండా, భారతదేశం గర్వించే సాంస్కృతిక విలువలను కాపాడుతూ పనిచేయడం మా బాధ్యత. ఈ నిర్ణయం అదే నిబద్ధతను ప్రతిబింబిస్తోంది.” అని తెలిపారు.
ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.





