HomeMovie News Teluguరామ్-భాగ్యశ్రీ వీడియో వైరల్.. పెళ్లి రూమర్స్ హాట్ టాపిక్

రామ్-భాగ్యశ్రీ వీడియో వైరల్.. పెళ్లి రూమర్స్ హాట్ టాపిక్

యంగ్ హీరో రామ్ పోతినేని మరియు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మించగా, స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. నవంబర్ 27న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

ఈ మూవీ షూటింగ్ ప్రారంభం నుంచి రామ్ – భాగ్యశ్రీల మధ్య రిలేషన్‌షిప్‌పై పలు పుకార్లు వినిపించాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. రామ్ రాసిన ‘నువ్వుంటే చాలు’ పాటను కూడా భాగ్యశ్రీని దృష్టిలో పెట్టుకుని రాశారని ప్రచారం జరిగింది. అయితే రామ్ వాటిపై క్లారిటీ ఇస్తూ.. పాట రాసిన సమయంలో హీరోయిన్ ఎవరో కూడా ఫైనల్ కాలేదని, రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు.

ఇంతలో తాజాగా భాగ్యశ్రీ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ థియేటర్లలో సందడి చేస్తుండగా, రామ్ – భాగ్యశ్రీ కలిసి అమెరికా ట్రిప్ వెళ్లారు. అమెరికాలో ఒకే కారులో ప్రయాణిస్తున్న వీడియోను భాగ్యశ్రీ పోస్ట్ చేయడంతో ప్రేమ రూమర్స్ మళ్లీ ఉధృతం అయ్యాయి.

వీడియోలో భాగ్యశ్రీ షూట్ చేస్తుండగా, రామ్ కూలింగ్ గ్లాసెస్‌తో స్టైలిష్‌గా కనిపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు “ఇంకెన్ని రోజులు దాచుకుంటారు?”, “పెళ్లి కార్డు పంపించండి.. పప్పన్నం తిని వస్తాం” అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రామ్ కెరీర్‌కు కొత్త ఊపు తెచ్చినప్పటికీ, అతని పర్సనల్ లైఫ్ రూమర్స్ కూడా అదే రేంజ్‌లో హంగామా చేస్తున్నాయి. రామ్ – భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారో లేదో తెలియకపోయినా.. ఈ వీడియో మాత్రం నెట్టింట హీట్ పెంచుతూ, నెటిజన్లలో లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular