సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను రాజమౌళి వెల్లడించినట్లు సమాచారం. సినిమా కథ వారణాసిలో ప్రారంభమై, అక్కడి నుంచి అంటార్కిటికా, ఆఫ్రికా, ప్రాచీన రోమ్ వంటి ప్రాంతాలకు ప్రయాణించి, చివరికి మళ్లీ వారణాసిలోనే ముగుస్తుందని ఆయన తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు 80 శాతం పూర్తయిందని, భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా ముగిసిందని సమాచారం. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, దసరా నాటికి మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం పని చేస్తోందని తెలుస్తోంది.
ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ నిర్మిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.





