back to top
Tuesday, December 16, 2025
spot_img
HomeMovie News Telugu'సామ్' పెళ్లి కబురు నిజమేనా ?

‘సామ్’ పెళ్లి కబురు నిజమేనా ?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. సామ్ కి చెందిన ఏ న్యూస్ అయినా క్షణాల్లో వైరలై పోతుంది. తాజాగా సామ్ రెండో పెళ్లి అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. నాగచైతన్య తో విడిపోయిన తరవాత సమంత కొన్నాళ్ల పాటు కామ్ గా తన పని తాను చేసుకుంటూ, టూర్స్, వెకేషన్స్ అంటూ బిజీగా ఉంది. సెకండ్ మ్యారేజ్ మాట ఎత్తలేదు. ఎవరైనా పెళ్లి గూర్చి మాట్లాడినా ఆ ఉద్దేశ్యం లేదని చెప్పేది సమంత. కానీ సడెన్ గా సామ్ – రాజ్ నిడిమోరు పై రూమర్స్ పై మొదలయ్యాయి.

ఈ విషయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కారణం రాజ్ పెళ్లి అయి పిల్లలున్నవాడు కావటమే. సామ్ కి ఏం కర్మ పెళ్లి అయ్యి పిల్లలున్నవాడిని చేసుకుంటోంది అని కొందరు బాధ పడగా . ఫాన్స్ మాత్రం ఎదో ఒకటి సామ్ సోలో లైఫ్ కి బాయ్ చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుంటోంది అని హ్యాపీ గా ఫిల్ అయ్యారు. గత కొంత కాలంగా చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఈ లవ్ బర్డ్స్ ఇప్పుడు పెళ్ళితో ఒకటి కానున్నారని తెలుస్తోంది.

డిసెంబరు 1 న సామ్, రాజ్ పెళ్లి చేసుకుంటున్నట్లు టాక్. సామ్ కి ఎంతో ఇష్టమైన కోయంబత్తూరు లోని ఇషా ఫౌండేషన్ లో సద్గురు ఆధ్వర్యంలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియటం లేదు. నిజంగా పెళ్ళిజరిగితే సామ్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుందా ? అసలు ఇలా సీక్రేట్ గా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అని ఫాన్స్ కలవర పడుతున్నారు. ‘ తెగించిన మనుషులు ఇలాంటి పనులే చేస్తారని’ రాజ్ భార్య పెట్టిన పోస్ట్ ఈ వార్తలకి మరింత బలం చేకూర్చింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular