2025 టాలీవుడ్ జర్నీ ఆశావహంగా సాగింది. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, డబ్బింగ్ మూవీస్ టాలీవుడ్ లో సందడి చేసాయి. ఇక డిసెంబరు నెల మిగిలుంది. ఈ నెలలో ‘అఖండ 2 తాండవం’ తో డిసెంబరు దండయాత్ర మొదలు కానుంది. క్రిస్మస్ సందర్భంగా మరికొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. డిసెంబరు 5 న బాలకృష్ణ- బోయపాటి రణరంగం ఉంది. సింహా, లెజెండ్, అఖండ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ 2 పై భారీ అంచనాలేర్పడ్డాయి. ‘అఖండ’ కి సీక్వెల్‌గా వస్తున్నఈ మూవీ సనాతన ధర్మం కాన్సెప్ట్ తో వస్తుండటం, ట్రైలర్ రిలీజ్ తో మరిన్ని ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ధురంధర్’ కూడా డిసెంబరు 5న రిలీజ్ కానుంది. రియల్ ఇన్సిడెన్స్ ని బేస్ చేసుకుని ఈ కథ తెరకెక్కింది. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్స్ ఉన్న ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ కానుంది.
డిసెంబరు సెకండ్ వీక్ లో యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వంలో డిసెంబరు 12న ‘మోగ్లీ’ మూవీ రానుంది. ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీలో సాక్షీ సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే రోజు రామ్ కిరణ్, మేఘా ఆకాష్ నటిస్తున్న ‘సఃకుటుంబానాం’ కూడా రిలీజ్ అవుతోంది. ఈ మూవీకి ఉదయ్ శర్మ దర్శకుడు. క్రిస్మస్ సందర్భంగా 25 న ‘శంబాల’ రిలీజ్ కానుంది. చాలా గ్యాప్ తరువాత ఆది సాయి కుమార్ శంబాలా సినిమాతో వస్తున్నాడు. సైన్స్, అతీంద్రియ శక్తుల నేపథ్యంతో ఈ కథ తెరకెక్కింది. శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన ‘ఛాంపియన్’ కూడా 25 న రిలీజ్ కానుంది. ఫుట్‌బాల్ క్రీడ తో పాటు లవ్ , దేశభక్తి మేళవింపుతో ప్రదీప్ డైరక్షన్ లో వస్తున్న ఈమూవీలో అనస్వర రాజన్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. శివాజీ, నవదీప్, బిందు మాధవి, రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్స్ లో నటించిన ‘దండోరా’ కూడా డిసెంబరు 25న రిలీజ్ కానుంది.
జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్’ కి థర్డ్ పార్ట్ ‘అవతార్- ఫైర్ అండ్ యాష్’ డిసెంబరు 19న రిలీజ్ అవుతోంది. ఫస్ట్ పార్ట్ లో పండోర అనే కల్పిత గ్రహాన్ని, సెకండ్ పార్ట్ లో వాటర్ లో అద్భుతాన్ని పరిచయం చేసిన దర్శకుడు థర్డ్ పార్ట్ లో పంచ భూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్ తో రూపొందించారు. ఫైనల్ గా డిసెంబరు నెలలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.



