ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా హుషారుగా ఉన్నారు. కారణం పుత్రికోత్సాహం. బన్నీ వారసురాలు అల్లు అర్హ ఈ ఏజ్ లోనే అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే సినిమాలు, సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న అర్హ ఇప్పుడు యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా అద్భుత ప్రతిభతో నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. అల్లు అర్హ సాధించిన ఈ ఘనత ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. బన్నీ ఫాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అర్హ తండ్రికి తగ్గ తనయ అని అంతా కీర్తిస్తున్నారు.
అర్హ 30 చెస్ పజిల్స్‌ను సాల్వ్ చేయటంలో 50 మంది స్టూడెంట్స్ ని ట్రైన్ చేసింది. ఇంత చిన్న వయసులో చెస్ ఆడటమే ఎక్కువ, అలాంటిది ట్రైన్ చేయటమంటే మాములు విషయం కాదు. అందుకే అర్హ నైపుణ్యాన్ని గుర్తించి నోబుల్ బుక్ లో స్థానం కల్పించారు. మొదట రీల్స్ లో ఆకట్టుకున్న అర్హ , తరువాత శాకుంతలం మూవీతో అలరించింది. ఇప్పుడు నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో మరింత ఫేమ్ తెచ్చుకుంది.

అర్హ, బన్నీ చేసే అల్లరిని ఎప్పటికప్పుడు స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. అర్హ అల్లరికి నెటిజన్స్ ముగ్ధులవుతుంటారు. మొత్తానికి అల్లు వారి అల్లరి పిడుగు చదువులో, నటనలో, ఆటలో, మాటలో అన్నిటిలో ఆల్ రౌండర్ గా ఎదుగుతోంది. భవిష్యత్తులో ఇండస్ట్రీలో కూడా నంబర్ వన్ గా ఎదిగి తండ్రిని మించిన తనయ అవ్వాలని కోరుకుంటున్నారు అల్లు ఫాన్స్.



