back to top
Tuesday, December 16, 2025
spot_img
HomeMovie News Teluguఇట్స్ అఫీషియల్.. సమంత పెళ్లి ఫొటోలు బయటకు

ఇట్స్ అఫీషియల్.. సమంత పెళ్లి ఫొటోలు బయటకు

గత కొన్ని వారాలుగా సమంత (Samantha) – రాజ్ నిడిమోరు (Raj Nidimoru) రిలేషన్ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ రూమర్స్‌పై ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్‌గా ఉన్న సమంత, చివరికి స్వయంగా పెళ్లి వార్తను అఫీషియల్ చేసింది.

ఈ రోజు కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకుని, వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం, పెళ్లి ఫోటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి బిగ్ షాక్ ఇచ్చింది.

ఫోటోల్లో.. క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్‌లో రాజ్, రెడ్ సారీ ధరించిన సమంత.. ఇద్దరూ చేతులు పట్టుకుని ఇంటి గడప దాటుతున్న క్షణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరో ఫొటోలో, పూలదండలు వేసుకున్న నూతన వధూవరులు లింగ భైరవ ఆలయంలో కలిసి హారతి తీసుకుంటూ కనిపించారు.

ఇంకో పిక్‌లో చేతులు నిండా గోరింటాకు వేసుకున్న సమంత, రాజ్ చేతిని గట్టిగా పట్టుకుని ఉండటం నెటిజన్లను ఆకట్టుకుంది.

ఈ ఫొటోలు బయటకొచ్చిన వెంటనే సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. కొంతమంది ఫ్యాన్స్ షాక్ అయ్యి “ఇంత సడెన్‌గా పెళ్లి చేసుకుంటావనుకోలేదు” అంటుంటే.. మరికొందరు “హ్యాపీ న్యూ జర్నీ.. కంగ్రాట్స్ కొత్త జంటకు” అంటూ విషెస్ తెలుపుతున్నారు.

సెలబ్రిటీల నుంచి కూడా శుభాకాంక్షల వరద వెల్లువెత్తుతోంది.

మొత్తానికి.. ఎన్ని రూమర్స్ వచ్చినా సైలెంట్‌గా ఉన్న సమంత, ఒక్కసారిగా పెళ్లి ఫొటోలు షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. నాగచైతన్య తర్వాత, ఆమె కూడా కొత్త జీవితం ప్రారంభించింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular