2025 లో టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ పేరు ఎక్కువగా వినిపించింది. కారణం సినిమాలు, వివాదాలు, కామెంట్స్. సితార బ్యానర్ లో హై బడ్జెట్ మూవీస్, భారీ అంచనాలతో వచ్చి ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయాయి. 2025 లో నాగవంశీ సినిమాలు ఎక్కువే వచ్చాయి. వీటిలో విజయ్ ‘కింగ్ డమ్’ ఎన్టీఆర్ వార్ 2 బాగా నిరాశ పరిచాయి. ప్రజంట్ 90’స్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ సీక్వెల్ గా ‘ఎపిక్’ తెరకెక్కింది. ఈ సిరీస్ లో బేబీ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్నారు.
ఎపిక్ సిరీస్ ఆదిత్య హాసన్ డైరక్షన్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. తాజాగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన నాగవంశీ ఈ ఏడాది మా బ్యానర్ నుంచి వచ్చిన ఫ్లాప్స్ వలన కొందరు నన్ను టార్గెట్ చేశారు. కానీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే తన బ్యానర్ నుండి నెలకు ఒక సినిమా రిలీజ్ చేస్తున్నానని , అన్నీ బ్లాక్ బస్టర్స్ అని తనని ట్రోల్ చేసిన వారికీ అదే సమాధానం అని కౌంటర్ వేశారు. ప్రస్తుతం నాగ వంశీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి నాగవంశీ బాగా హార్ట్ అయ్యాడని ఇప్పుడు పంతంతో నెలకో సినిమా అని అనౌన్స్ఉ చేసాడని అంచనా వేస్తున్నారు. నాగవంశీ నెలకొక హిట్ కొడితే మంచిదే అని టాలీవుడ్ కే క్రెడిట్ దక్కుతుందని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు మరి కొందరు.



