back to top
Tuesday, December 16, 2025
spot_img
HomeMovie News Teluguవెంకీ త్రివిక్రమ్ కాంబోలో కత్రినా ?

వెంకీ త్రివిక్రమ్ కాంబోలో కత్రినా ?

విక్ట‌రీ వెంక‌టేష్ – త్రివిక్ర‌మ్ కాంబోలో ఒక మూవీ మొదలైన సంగతి తెలిసిందే. ఎన్నాళ్ళుగానో వెంకీ, త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో నటించాలని ఫాన్స్ ఆశ పడ్డారు. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ కి వెంకీ టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుందని అంతా ఆశించారు . ఫైనల్లీ ఈ కాంబో మొదలయ్యింది. వెంకీ కెరియర్ లో బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకి త్రివిక్రమ్ మాటలు రాసారు. త్రివిక్రమ్ డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. ఇప్పడు ఏకంగా త్రివిక్రమ్ డైరక్షన్ లోనే వెంకీ నటిస్తున్నాడు అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మూవీలో వెంకీ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తోంది. వెంక‌ట‌ర‌మ‌ణ పాత్రలో వెంకీ చేసే అల్లరి కోసం సినీప్రియులు వెయిటింగ్. వెంకీ ప్రస్తుతం ‘మ‌న‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూట్ పూర్తి అయ్యాకా త్రివిక్ర‌మ్ సెట్ లో జాయిన్ అవనున్నాడట. ఈ కాంబో పై లేటెస్ట్ గా మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ మూవీలో క‌త్రినా కైఫ్ ను కూడా తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నారట త్రివిక్రమ్. కత్రినా- వెంకీ జోడీ మల్లీశ్వరిలో బాగా వర్కౌట్ అయ్యింది. ఇదే కాంబో రిపీట్ చేసే ఉద్దేశ్యంలో గురూజీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. కత్రిన కోసం స్పెషల్ రోల్ డిజైన్ చేసారని టాక్.

స్పెషల్ రోల్ కుదరకపోతే కనీసం గెస్ట్ రోల్ అయినా చేయించాలని త్రివిక్రమ్ గట్టి పట్టుదలగా ఉన్నారట. కత్రినా కూడా నో చెప్పే ఛాన్స్ లేదు. వెంకీ కత్రినాకి లక్కీ చార్మ్. పైగా త్రివిక్రమ్ మూవీ. ప్రస్తుతం టాలీవుడ్ నంబర్ వన్ రేసులో ఉంది. పాన్ ఇండియా కథలతో దూసుకు పోతుంది. సో కత్రినాకి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. కత్రినా ఈ మూవీలో నటిస్తే పాన్ ఇండియా మార్కెట్ కూడా కలిసి వస్తుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular