టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ, రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల ‘మోగ్లీ’ సినిమాతో టాలీవుడ్ లో సందడి చేయనున్నాడు. రోషన్ కి ఇది సెకండ్ మూవీ. మోగ్లీ మూవీకి ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం లో ఈ మూవీ తెరకెక్కుతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ కథ పై ఆసక్తిని పెంచింది. ఈ మూవీలో విలన్ గా బండి సరోజ్ నటిస్తున్నాడు. ‘ రాజు గారికి ఏడుగురు కొడుకులు, ఆ ఏడుగురు వేటకి వెళ్లి ఏడు చేపలు తెచ్చారు’ అని కథ చెప్తూ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. తరువాత లవ్ స్టోరీ, డఫ్ & డమ్ అయిన అమ్మాయి కోసం హీరో విలన్ కొట్టుకోవటం కథ అని తెలుస్తోంది.
కలర్ ఫొటో కథలానే ‘మోగ్లీ’ కోసం కూడా డిఫరెంట్ లవ్ స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు సందీప్ రాజ్. కాకపోతే హీరోని హైలెట్ చేస్తూ సాగే కథ అని తెలుస్తోంది. ‘ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళని గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి’ అంటూ ఒక్క డైలాగ్ తో ఆంజనేయుడిని ఎంటర్ చేసారు. అంటే ఈ కథకి కూడా రామాయణాన్ని ముడి పెట్టారా ? ఈ కథలో ప్రేమికుల కోసం హనుమాన్ ని దింపనున్నారా ? అని డౌట్స్ మొదలయ్యాయి.
ప్రజంట్ సినిమా కథలన్నీ రామాయణం చుట్టూ తిరుగుతున్నాయి. కథ ఏదైనా కొంచెం మైథి లాజికల్ టచ్ ఇస్తే పాన్ ఇండియా హిట్ గ్యారంటీ అని నమ్మకం వచ్చేసింది. అందుకే ప్రతి కథకి అవసరం ఉన్నా లేకపోయినా రాముడ్ని, హనుమంతుడిని వాడేస్తున్నారు. ఇప్పుడు మోగ్లీ కథకి కూడా ఇదే అస్త్రం ఉపయోగిస్తున్నారా అన్నది చూడాలి. హీరో, హీరోయిన్, విలన్ రోల్స్ రాముడు, సీత, రావణుడు అనుకొంటే మరి హనుమాన్ గా ఎవర్ని దింపనున్నారు. ఇలాంటి డౌట్స్ తో ట్రైలర్ పై అందరిలో ఆసక్తి పెరిగింది. డిసెంబర్ 12న ఈ డౌట్స్ కి క్లారిటీ రానుంది. 12 న మోగ్లీ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది.



