HomeMovie News Teluguచెన్నై లవ్ స్టోరీ కి సూపర్ ఓపెనింగ్స్..

చెన్నై లవ్ స్టోరీ కి సూపర్ ఓపెనింగ్స్..

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద శుభారంభం చేసింది. ఈ చిత్రంలో తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించగా, సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించారు.

జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు విడుదలకు ముందే నిర్వహించిన ప్రీమియర్ షోలకు మంచి స్పందన లభించింది. ఆ పాజిటివ్ టాక్ ప్రభావం తొలి రోజు వసూళ్లలో కూడా కనిపించింది.

తాజాగా చిత్రబృందం విడుదల చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం, ప్రీమియర్ షోలు మరియు తొలి రోజు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.12.3 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ప్రకటించింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వీకెండ్‌లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే ఫుల్ రన్‌లో మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ‘చెన్నై లవ్ స్టోరీ’ విజయంతో కిరణ్ అబ్బవరం మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సమయానికి ఎలాంటి బాక్సాఫీస్ రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular