back to top
Monday, December 15, 2025
spot_img
HomeMovie News Telugu‘అఖండ 2’ టికెట్ ధరలు పెంపు..

‘అఖండ 2’ టికెట్ ధరలు పెంపు..

నందమూరి బాలకృష్ణ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’ డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమైంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హిందూ ధర్మానికి సంబంధించిన అంశాలపై నడిచే ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

రిలీజ్‌కు కేవలం మూడు రోజులు మాత్రమే ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘అఖండ 2’ టికెట్ ధరలు పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

ఏపీ ప్రభుత్వం అనుమతించిన కొత్త టికెట్ ధరలు:

డిసెంబర్ 4 ప్రీమియర్ షోలు:

  • టికెట్ ధరలకు ₹600 అదనంగా పెంపు
  • రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రీమియర్ షోలు అనుమతి

డిసెంబర్ 5 నుంచి (పది రోజుల పాటు):

  • మల్టీప్లెక్స్‌లు: ₹100 పెంపు
  • సింగిల్ స్క్రీన్‌లు: ₹75 పెంపు
  • రోజుకు 5 షోలు నిర్వహించేందుకు అనుమతి

ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా జీఓ జారీ చేసింది.

‘అఖండ 2’ ను రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో, 14 రీల్స్ ప్లస్ మరియు IVY ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందింది.

ఈ చిత్రం 2 గంటలు 50 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular