HomeTeluguచెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ & రేటింగ్

చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం: చెన్నై లవ్ స్టోరీ
దర్శకత్వం: రవి నంబూరి
స్క్రీన్ ప్లే – మాటలు: రవి నంబూరి
కథ – రచన: సాయి రాజేష్

నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ, త్రిగుణ్, సిరి హనుమంతు, దేవి ప్రసాద్, ప్రమోదిని, నవీన్ తదితరులు.

నిర్మాతలు: ఎస్‌కేయన్‌, సాయి రాజేశ్‌

సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: విశ్వాస్‌ డానియల్‌
ఎడిటర్: సంతోశ్‌ నాయుడు

బ్యానర్: మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ & అమృత ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 24 జూలై 2026

కెరియర్ మొదటి నుంచి విభిన్న కథలని ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు కిరణ్ అబ్బవరం. కిరణ్ సినిమా అంటే యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తారు. ఏడాదికి రెండు సినిమాల్తో అలరించే కిరణ్ ఈ ఏడాది చెన్నై లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మొదటి నుంచి ‘చెన్నై లవ్‌స్టోరీ’ పై భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ నుంచే సినిమాపై హైపు పెరిగింది. ఫస్ట్ లవ్ డైలాగ్స్ అన్నీ ఆకట్టుకున్నాయి. పైగా ‘కలర్ ఫోటో’, ‘బేబీ’ లాంటి లవ్ స్టోరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాయి రాజేశ్‌ఈ చిత్రానికి కథ అందించటం, కూడా చెన్నై లవ్ స్టోరీపై ఆసక్తిని పెంచాయి. ఈ శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది ? కిరణ్ హిట్ కొట్టాడా ? SKN, సాయి రాజేష్ కాంబో మళ్ళీ వర్కౌట్ అయ్యిందా? లేదో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ:

దర్శకుడు కావాలని కలలు కంటూ ఆ కలల్ని నిజం చేసుకోవటానికి చెన్నైకి వస్తాడు అనాథ అయిన స్టీవెన్‌ శంకర్‌ (కిరణ్ అబ్బవరం). ప్రేమించిన వాడు మోసం చేసి పెళ్లిమండపంలో నిర్దాక్షిణ్యం గా వదిలేసి వెళ్ళిపోతే అన్ని కోల్పోయి, జీవితంపైనే ఆశ లేకుండా జీవశ్చవంలా మిగిలిన నివి (శ్రీ గౌరీ ప్రియ) జీవితంలోకి అనుకోకుండా పరిచయం అవుతాడు స్టీవెన్. అతని స్నేహంతో నివి తన బాధని మర్చి, మళ్ళీ జీవితం పై ఆశలు పెంచుకుంటుంది. కానీ మళ్ళీ ఈ ప్రేమకు మరో ఊహించని మలుపు ఎదురవుతుంది? ఏమిటా సంఘటన ? స్టీవెన్ చివరికి దర్శకుచివరికిడు అయ్యాడా? నివి ప్రేమ కథ సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది ఈ రివ్యూలో చూద్దాం?

విశ్లేషణ:

ఎన్ని సార్లు చూసినా, చెప్పినా బోర్ కొట్టని జోనర్ ఏదైనా ఉందంటే అది లవ్ స్టోరీస్ అని చెప్పాలి. తెరపై ఎప్పుడు ఎదో ఒక ప్రేమ కథ వస్తూనే ఉంటుంది. ప్రేమ ఎప్పుడు ఒకటే , కానీ అందులో ఘాడత , బావసాంద్రత విభిన్నంగా ఉంటుంది. ఈ ప్రేమ కథలకి ఉన్న గొప్పతనమేంటి అంటే చివరికి ప్రేమ విజయం సాధించినా, విఫలమైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలాంటి కథలు ఎన్నో వచ్చాయి , ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కూడా ఇదే కోవకి చెందుతుంది. ప్రేమ కథలకి తరాల అంతరాయం ఉండదు. అన్ని తరాల వారికి ఈ కథలు కనెక్ట్ అవుతాయి. కాకపొతే కథలోని కారెక్టర్స్‌కి ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా, ఆ ప్రేమ కథని ఆడియన్స్ ఓన్ చేసుకునేలా, ఆ జంట ఎమోషన్‌ని సరిగ్గా ప్రజెంట్ చేయగిలిగితే సూపర్ హిట్ గ్యారంటీ.

ప్రతి ప్రేమ కథకి పరిచయం ఎంత ముఖ్యమో ముగింపు కూడా అంతే ముఖ్యం. ఈ కథలో కూడా హీరో హీరోయిన్ కలిసిన కాన్సెప్ట్, సందర్భం లాజికల్ గా ఉంటుంది. ప్రతి ప్రేమ కథలానే ఇందులో కూడా హీరో హీరోయిన్స్ ఎలా కలిశారు. వారి ప్రయాణం ఎలా సాగింది ? వారి మధ్య ప్రేమ పుట్టడానికి కారణం ఏంటి ? తరవాత ఏం జరిగింది? గొడవలు, దూరం, మళ్ళీ కలవటం అన్నీ ఇంట్రెస్ట్ గా ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన కథల్లో హీరో మోసపోయి, దేవదాస్ లా మారిపోతాడు. కానీ చెన్నై లవ్ స్టోరీ లో హీరోయిన్ ప్రియుడి చేతిలో మోసపోయి లేడీ దేవదాసు లా తయారవుతుంది. ముందుకి బానిస అయిన నివికి అమాయకంగా, ఎలాంటి కల్మషం లేని స్టీవెన్ ఎదురవటం వారి మధ్య స్నేహం, ప్రేమ అన్నీ ఆడియన్స్ కూడా ఆ కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి.

ఇంటర్వెల్ వరకు కథ చాలా సాఫీగా, ఆనందంగా సాగుతుంది. ఇంటర్వెల్‌కి ఊహించని ట్విస్ట్ తో ప్రేక్షులకి మంచి ఎగ్జైట్ మెంట్ ఇస్తుంది. ఇంటర్వెల్ బాంగ్ లో వచ్చే ఓ సీన్ గుండెల్ని పిండేసేలా ఉంటుంది. మంచి హార్ట్ టచింగ్ సీన్ తో బ్రేక్ ఇచ్చి సెకండాఫ్‌ పై ఆత్రుత పెంచాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ కథ మొత్తం ఫస్ట్ హాఫ్ కి బిన్నంగా ఉంటుంది. స్టీవెన్‌ని దేవుడిలా పూజించే మురుగన్ తల్లితో ఉండే ఎమోషనల్ సీన్స్, మరికొన్ని కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షుకులకి మంచి అనుభూతిని ఇస్తాయి. మొత్తానికి కిరణ్ అబ్బవరం ఒక క్లాసిక్ లవ్ స్టోరీ తో వచ్చి ఆడియన్స్ ని ఏడిపించేసాడు.

నటీ నటులు:

ఎప్పటిలా కిరణ్ అబ్బవరం ఈ కథలో ఒదిగిపోయాడు. కిరణ్ ని తప్ప ఈ కథలో ఇంకొకరిని ఊహించు కోలేనంతంగా తన నటనతో ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. కిరణ్ నటన చాలా సహజ సిద్ధంగా, ఫుల్ ఎమోషనల్ గా ఉంది. ఎమోషనల్ సీన్లలో కిరణ్ మునపటి కంటే బాగా నటించాడు. స్టీవెన్ గా మరొకసారి కిరణ్ ఆడియన్స్ మనసులు గెల్చుకున్నాడు. నివి పాత్ర పోషించిన గౌరీ ప్రియ కూడా తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యం గా ఈ సినిమాకి హీరో హీరోయిన్స్ ప్లస్ అని చెప్పాలి. మొదటి సినిమాతోనే గౌరీ ప్రియా తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుంది. నివి పాత్రకు కనెక్ట్ కానీ ప్రేక్షకుడు ఉండ డు. అజయ్ పాత్రలో త్రిగుణ్ తన పాత్రకు న్యాయం చేశాడు. సిరి హనుమంతు, జోష్ రవి నటన కూడా మెప్పించే విధంగా ఉంది. మిగిలిన నటీ నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్:

చెన్నై లవ్ స్టోరీని ఒక క్లాసిఈక్ లవ్ స్టోరీగా మల్చటం లో దర్శకుడు రవి నంబూరి సఫలం అయ్యాడనే చెప్పొచ్చు. భావోద్వేగాల సమ్మేళనం తో ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించేలా ఉంది. ఈ సినిమాకు పెద్ద ప్లస్ మణిశర్మ అని చెప్పొచ్చు. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే మణిశర్మ సంగీత దర్శకుడు. కానీ ఇప్పుడు చిన్న సినిమాలకి వర్క్ చేస్తూ వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటున్నారు. చెన్నై లవ్ స్టోరీ లో మణిశర్మ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. మణిశర్మ సంగీతం ఈ కథకి ఆత్మలా ఉంది. పాటలు వినటానికి , స్క్రీన్ పై చూడటానికి చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎమోషన్స్ పీక్స్ కి వెళ్లినట్టు అనిపిస్తుంది. విశ్వాస్ కెమెరా వర్క్ చాలా బాగుంది. చెన్నై సిటీ అందాలు, హీరో-హీరోయిన్లు ఉండే ఇల్లు, చాలా ఆహ్లాదకరంగా స్క్రీన్ పై ప్రజంట్ చేసారు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా తీర్చిదిద్దారు. కొన్ని ఫ్రేమ్స్ లో మణిరత్నం, గౌతమ్ మీనన్ ని తలపించారు. టెక్నీకల్ టీమ్ చేసిన హార్డ్ వర్క్ స్క్రీన్ పై కనిపిస్తోంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

కిరణ్ అబ్బవరం
గౌరీ ప్రియా
మణిశర్మ సంగీతం

మైనస్ పాయింట్స్

నిడివి
సాగదీత సీన్స్

You May Like This
- Advertisment -spot_img

Most Popular