మంత్రి కొండా సురేఖ మరియు అక్కినేని కుటుంబం మధ్య నెలకొన్న వివాదానికి ఎట్టకేలకు ముగింపు లభించింది. అక్కినేని నాగార్జున (Nagarjuna) మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన క్రిమినల్ కేసును అధికారికంగా వెనక్కి తీసుకున్నారు.
గతంలో నాగ చైతన్య-సమంత విడాకుల వివాదంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల కారణంగా నాగార్జున ఆమెపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అయితే, ఇటీవల కొండా సురేఖ తన సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా నాగార్జునకు క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశారు.
I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members.
I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members.
I regret any unintended impression…
— Konda Surekha (@iamkondasurekha) November 11, 2025
ఆ ట్వీట్లో ఆమె ఇలా పేర్కొన్నారు:
“నా వ్యాఖ్యలు ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశంతో చేయలేదు. నాగార్జున గారినీ, ఆయన కుటుంబ సభ్యులనూ అవమానించే ఉద్దేశ్యం నాకు లేదు. నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, దానికి క్షమాపణలు కోరుతున్నాను. నేను చేసిన వ్యాఖ్యలను అధికారికంగా ఉపసంహరించుకుంటున్నాను.”

ఈ పరిణామాల తర్వాత, ఈరోజునాంపల్లి కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా వర్చువల్గా హాజరైన నాగార్జున, తాను దాఖలు చేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. కోర్టు ఆయన నిర్ణయాన్ని ఆమోదించడంతో, ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం పూర్తిగా ముగిసినట్లైంది.
ఇక ఈ పరిణామం కొండా సురేఖకు పెద్ద ఉపశమనం (బిగ్ రిలీఫ్)గా మారింది. నాగార్జున పెద్ద మనసుతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని సినీ మరియు రాజకీయ వర్గాలు స్వాగతిస్తున్నాయి.





