టాలీవుడ్‌లో ప్రతీ వారం కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటే, మరికొన్ని ఫ్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చర్చనీయాంశంగా మారిన చిత్రం ‘లవ్ ఓటీపీ (Love OTP)’. నవంబర్ 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే రిలీజ్‌కు ముందు హీరో రాజీవ్ కనకాల పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించారు.
ఈ సినిమాలో అనీష్ హీరోగా నటించగా, జాన్వికా కలకేరి, స్వరూపిణి కీలక పాత్రల్లో కనిపించారు. రాజీవ్ కనకాల ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర పోషించారు. సంగీతాన్ని ఆనంద్ రాజ్ విక్రమ్ అందించగా, సినిమాను విజయ్ ఎం. రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం భవప్రిత ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపొందింది.
. @RajeevCo and @i_am_Aniissh Garu Getting Emotional About Jounery of #LoveOTP 🥹🥹🥲
— Sivamallala (@SivaMallala) November 13, 2025
Team and Media Enjoy the Paid Premier Of the Movie #LoveOTP 🥳🎬@BhavapritaLtd
@its_me_aarohi @natyaranga@ARajavikram @SivaMallala #LOVEOTP #Rajeev pic.twitter.com/4dTYReZ0C1
ప్రీమియర్ అనంతరం హీరో-దర్శకుడు అనీష్ తేజేశ్వర్ మాట్లాడుతూ..
“ఈ రోజు కోసం నేను 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. నా సినిమా చూసే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది. ఇది నాకు చాలా స్పెషల్ మోమెంట్,” అని ఆనందం వ్యక్తం చేశారు.
అదే ఈవెంట్‌లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ “ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. అనీష్ నాకు పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చినట్టే. ఆయన ఈ సినిమాకి పడిన కష్టం అంతా ఇంతా కాదు. సినిమా ఔట్‌పుట్ అద్భుతంగా ఉంది. ఇద్దరు హీరోయిన్‌లు కూడా దుమ్ములేపారు,” అని ప్రశంసించారు.
మొత్తం మీద, ‘లవ్ ఓటీపీ’ చిత్రం విడుదలకు ముందే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. యువ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.





