HomePolitics Teluguకొండా సురేఖకు బిగ్ రిలీఫ్.. కీలక నిర్ణయం తీసుకున్న నాగార్జున..!

కొండా సురేఖకు బిగ్ రిలీఫ్.. కీలక నిర్ణయం తీసుకున్న నాగార్జున..!

మంత్రి కొండా సురేఖ మరియు అక్కినేని కుటుంబం మధ్య నెలకొన్న వివాదానికి ఎట్టకేలకు ముగింపు లభించింది. అక్కినేని నాగార్జున (Nagarjuna) మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన క్రిమినల్ కేసును అధికారికంగా వెనక్కి తీసుకున్నారు.

గతంలో నాగ చైతన్య-సమంత విడాకుల వివాదంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల కారణంగా నాగార్జున ఆమెపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అయితే, ఇటీవల కొండా సురేఖ తన సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా నాగార్జునకు క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్‌లో ఆమె ఇలా పేర్కొన్నారు:

“నా వ్యాఖ్యలు ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశంతో చేయలేదు. నాగార్జున గారినీ, ఆయన కుటుంబ సభ్యులనూ అవమానించే ఉద్దేశ్యం నాకు లేదు. నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, దానికి క్షమాపణలు కోరుతున్నాను. నేను చేసిన వ్యాఖ్యలను అధికారికంగా ఉపసంహరించుకుంటున్నాను.”

ఈ పరిణామాల తర్వాత, ఈరోజునాంపల్లి కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా వర్చువల్‌గా హాజరైన నాగార్జున, తాను దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. కోర్టు ఆయన నిర్ణయాన్ని ఆమోదించడంతో, ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం పూర్తిగా ముగిసినట్లైంది.

ఇక ఈ పరిణామం కొండా సురేఖకు పెద్ద ఉపశమనం (బిగ్ రిలీఫ్)గా మారింది. నాగార్జున పెద్ద మనసుతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని సినీ మరియు రాజకీయ వర్గాలు స్వాగతిస్తున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular