HomeMovie News Teluguగ్లోబెట్రోటర్ ఈవెంట్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్!

గ్లోబెట్రోటర్ ఈవెంట్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుగా నిలుస్తోంది. వర్కింగ్ టైటిల్‌గా SSMB29గా పిలుస్తున్న ఈ సినిమా, గ్లోబల్ స్థాయిలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ ఎంటర్‌టైనర్ గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనుండటం విశేషం.

షూటింగ్ వేగంగా కొనసాగుతున్నప్పటికీ, ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్స్ లేకపోవడంతో మహేశ్ బాబు అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఇటీవల నుంచి వరుసగా అప్‌డేట్స్ విడుదల చేస్తూ చిత్ర బృందం ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగా విలన్ పాత్రకు సంబంధించిన పోస్టర్, అలాగే ‘గ్లోబెట్రోటర్ ఈవెంట్‌ సాంగ్’ ను కూడా రిలీజ్ చేశారు.

ఇక బుధవారం సాయంత్రం హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ నెల 15న భారీ స్థాయిలో గ్లోబెట్రోటర్ ఈవెంట్ జరగనుంది. దీనిపై ఈ రోజు దర్శకుడు రాజమౌళి కీలక అప్‌డేట్ ఇచ్చారు.

రాజమౌళి ప్రత్యేక వీడియోను విడుదల చేస్తూ..

“నవంబర్ 15న జరిగే #గ్లోబెట్రోటర్ ఈవెంట్‌లో మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈవెంట్ రోజున RFC ప్రధాన ద్వారం మూసివేయబడుతుంది. మీ ఎంట్రీ పాస్‌లో ఉన్న సూచనలను తప్పనిసరిగా అనుసరించండి. అందరికీ ఇబ్బంది లేని, సురక్షితమైన, ఆనందదాయక అనుభవం అందించేందుకు పోలీసులు, భద్రతా సిబ్బందితో సహకరించండి” అని అభిమానులకు స్పష్టంగా రిక్వెస్ట్ చేశారు.

తెలుగు సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి.. ఓ సినిమా పరిచయ ఈవెంట్‌ను ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేయనుండటం విశేషం. ఈవెంట్‌కి అభిమానులకు ఉచిత పాస్‌లు కూడా అందించారు.

ఇకపోతే హైదరాబాద్‌, నైరోబి (కెన్యా) తదితర లొకేషన్లలో షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఒక విజువల్ గ్రాండ్ ట్రీట్ గా రూపొందుతోంది.

మహేశ్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్ కలిగించింది. అధికారిక టైటిల్ ఇంకా ప్రకటించకపోయినా, ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా 2027లో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular