HomeMovie News Teluguఅనిల్ రావిపూడి సినిమాకు జీవీ ప్రకాశ్..

అనిల్ రావిపూడి సినిమాకు జీవీ ప్రకాశ్..

విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న ఆయన.. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఇప్పటివరకు తన సినిమాలకు భీమ్స్ సిసిరోలియోతో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందుకున్న అనీల్ రావిపూడి, ఈసారి తన కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అనిల్ రావిపూడి ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన, జీవీ ప్రకాశ్ కలిసి ఓ పాత వీడియో కాన్సెప్ట్‌ను సరదాగా రీక్రియేట్ చేశారు. ఇద్దరూ కలిసి చేసిన ఫన్నీ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులతో వెంటనే కనెక్ట్ అయ్యే సంగీతాన్ని అందించగల సామర్థ్యం జీవీ ప్రకాశ్‌కు ఉంది. మా కొత్త ప్రాజెక్ట్‌లో ఆయనను సాదరంగా ఆహ్వానిస్తున్నాం’ అని తెలిపారు. అలాగే ఈ వీడియో గురించి స్పందిస్తూ.. ‘ఈ సరదా కాన్సెప్ట్‌ను రూపొందించడంలో మేము ఎంతో ఆనందించాం. ఈ ఆలోచనను నమ్మి, పూర్తి ఉత్సాహంతో పాల్గొన్న జీవీ ప్రకాశ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. కలిసి మరెన్నో అందమైన జ్ఞాపకాలు సృష్టించాలని ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular