HomeMovie News Teluguమరోసారి వాయిదా పడిన లెనిన్..

మరోసారి వాయిదా పడిన లెనిన్..

అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లెనిన్ సినిమా మరోసారి వాయిదా పడింది. అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే వివిధ కారణాల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం, తాజాగా జూన్ 26 విడుదల తేదీని కూడా మిస్ చేసుకుంది. గత కొద్ది రోజులుగా సినిమా వాయిదాపై వార్తలు వినిపిస్తుండగా, ఇప్పుడు చిత్రబృందం అధికారికంగా కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

నాగార్జున తన పోస్ట్‌లో.. టీమ్ లెనిన్ నా వద్దకు ఒక అభ్యర్థనతో వచ్చింది. సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు కొంత అదనపు సమయం కావాలని కోరింది. వారి అంకితభావం, కష్టాన్ని గౌరవిస్తూ నేను అందుకు అంగీకరించాను. జూలై 10న మనోడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోసారి చెబుతున్నాను.. మీరు ఒక కొత్త అఖిల్‌ను చూడబోతున్నారు. లెనిన్ అనుభూతికి సిద్ధంగా ఉండండి అని పేర్కొన్నారు.

దీంతో లెనిన్ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నాగార్జున చేసిన ఈ ప్రకటనతో అఖిల్ అభిమానుల్లో మరోసారి ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో అఖిల్ కొత్త లుక్, కొత్త పాత్రలో కనిపించనున్నారనే అంచనాలు మరింత పెరుగుతున్నాయి. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న లెనిన్ అఖిల్ కెరీర్‌లో కీలక చిత్రంగా నిలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular