HomeMovie News Teluguశర్వానంద్ - శ్రీనువైట్ల మూవీలో హీరోయిన్ ఫిక్స్?

శర్వానంద్ – శ్రీనువైట్ల మూవీలో హీరోయిన్ ఫిక్స్?

టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల బైకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు భోగి అనే యాక్షన్ డ్రామాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉండగా, శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు శ్రీనువైట్లతో చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌లకు పేరుగాంచిన శ్రీనువైట్ల ఈసారి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

శ్రీనువైట్ల మార్క్ కామెడీకి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వినోదంతో పాటు కొత్త కాన్సెప్ట్ ఉండటంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెరుగుతోంది.

ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. జూలై 2026 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై గత కొద్ది రోజులుగా పలు పేర్లు వినిపించాయి. మొదట పూజా హెగ్డే, మమిత బైజు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం.. మిస్ ఇండియా రన్నరప్ మానస వారణాసి ను హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇటీవల కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మానస.. ఇప్పుడు శర్వానంద్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

శర్వానంద్ – మానస జోడీ వెండితెరపై ఫ్రెష్ ఫీల్ ఇస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు శ్రీనువైట్ల కామెడీకి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ జతకావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉన్నట్లు సమాచారం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular