HomeMovie News Teluguవిజయ్ జన నాయగన్.. యష్ టాక్సిక్ లకు భారీ డీల్..?

విజయ్ జన నాయగన్.. యష్ టాక్సిక్ లకు భారీ డీల్..?

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా గురించి ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మొదట ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని కారణాలతో రిలీజ్ వాయిదా పడింది.

అయితే ఇప్పటివరకు కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్‌పై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

మొదట ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ దక్కించుకోవాలని ప్రయత్నించినట్లు టాక్ వినిపించింది. కానీ సినిమా వరుసగా వాయిదా పడుతుండటంతో ఆ చర్చలు ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత జీ5 సంస్థ కూడా ఈ మూవీ ఓటీటీ హక్కుల కోసం ఆసక్తి చూపినట్లు ప్రచారం జరిగింది.

ఇప్పుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడంతో ఆయన క్రేజ్ మరింత పెరగడంతో.. అమెజాన్ మళ్లీ ‘జన నాయగన్’ హక్కుల కోసం ముందుకొచ్చినట్లు సమాచారం.

ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇదే సంస్థ యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమాను కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

టాక్సిక్ ఓటీటీ హక్కుల కోసం కూడా అమెజాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

దీంతో జన నాయగన్, టాక్సిక్ రెండు సినిమాల డిజిటల్ హక్కులను కలిపి దాదాపు రూ.200 కోట్లకు విక్రయించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ డీల్ సక్సెస్ అయితే కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇది భారీ లాభాలను తీసుకురానుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక జన నాయగన్, టాక్సిక్ సినిమాలపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ రెండు చిత్రాలు కూడా వరుసగా వాయిదా పడుతూ రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular