టాలీవుడ్‌లో అత్యంత క్రేజ్ ఉన్న జంటల్లో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట ఒకటి. సినిమాలతో పాటు యాడ్స్‌లో కూడా ఈ ఇద్దరూ కలిసి కనిపిస్తే ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.
ఇటీవల ఈ జంట కలిసి నటించిన ప్రకటనలు సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్, లైక్స్ సాధిస్తూ గ్లోబల్ లెవెల్‌లో ట్రెండ్ అవుతున్నాయి.
కొంతకాలం క్రితం విజయ్ – రష్మిక కలిసి ప్రముఖ వెడ్డింగ్ బ్రాండ్ మన్యవార్ యాడ్‌లో నటించారు. ఆ యాడ్ అప్పట్లో సోషల్ మీడియాలో భారీ సెన్సేషన్‌గా మారింది.
ఈ ప్రకటనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 11.5 మిలియన్లకు పైగా లైక్స్ రావడం విశేషం. ప్రపంచంలోనే అత్యధిక లైక్స్ సాధించిన యాడ్స్‌లో ఇది టాప్‌లో నిలిచినట్లు ప్రచారం జరిగింది.
అంతేకాకుండా, ఈ యాడ్‌కు 104 మిలియన్ వ్యూస్ రావడం కూడా మరో రికార్డ్‌గా మారింది.
ఇప్పుడు మరోసారి విజయ్ – రష్మిక జంట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తాజాగా వీరిద్దరూ కలిసి Airbnb యాడ్‌లో నటించారు.
ఈ యాడ్‌కు కూడా సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టుకు ఇన్‌స్టాగ్రామ్‌లో 9.1 మిలియన్ లైక్స్ వచ్చినట్లు సమాచారం.
విజయ్ – రష్మిక కలిసి నటించిన యాడ్స్‌కు వరుసగా భారీ వ్యూస్, లైక్స్ రావడంతో ఈ జంట గ్లోబల్ స్థాయిలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
మొత్తానికి, సినిమాలతోనే కాదు.. యాడ్స్‌తో కూడా విజయ్ – రష్మిక జంట సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది.





