HomeMovie News Teluguఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్..

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన తారక్.. ఇప్పుడు వరుస క్రేజీ సినిమాలతో అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో మూడు భారీ ప్రాజెక్టులు ఉండగా, వాటికి సంబంధించిన కీలక అప్‌డేట్స్ ఒకే రోజు రాబోతున్నాయన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్‌లు సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మే 19 అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేసే అవకాశముందని సమాచారం.

అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అదే రోజు వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి గాడ్స్ ఆఫ్ వార్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక దర్శకుడు కొరటాల శివ కూడా దేవర 2 సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఒకే రోజు మూడు భారీ అప్‌డేట్స్ రాబోతున్నాయన్న వార్తతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు.

మొత్తానికి, ఈసారి తారక్ బర్త్‌డేను అభిమానులు భారీ స్థాయిలో సెలబ్రేట్ చేసుకునేలా మూవీ టీమ్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular