పశ్చిమ ఆసియాలో ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమయంలో టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఆకాశంలో క్షిపణులు దూసుకుపోతున్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగింది.
అయితే తన భద్రతపై వస్తున్న వార్తలకు స్పందిస్తూ మంచు విష్ణు తాజాగా సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. తాము పూర్తిగా సురక్షితంగా ఉన్నామని చెబుతూ అభిమానుల ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేశారు.
“మా భద్రత గురించి ఆందోళన చెందుతూ మెసేజ్‌లు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మేము దుబాయ్‌లో సురక్షితంగా ఉన్నాము. నా కుటుంబం క్షేమంగా ఉంది. అప్పుడప్పుడు దూరంగా వినిపించే శబ్దాలు తప్ప ఇక్కడ సాధారణ జీవితం ప్రశాంతంగానే కొనసాగుతోంది” అని విష్ణు తన పోస్టులో పేర్కొన్నారు.
ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా దుబాయ్ ప్రభుత్వం తీసుకుంటున్న రక్షణ చర్యలను ఆయన ప్రశంసించారు. “ఇలాంటి సమయాల్లో దుబాయ్ అధికారుల నిశ్శబ్ద సామర్థ్యం, క్షేత్రస్థాయిలో వారి సిద్ధత అద్భుతంగా ఉంది. మమ్మల్ని సురక్షితంగా ఉంచుతున్న UAE అధికారులకు కృతజ్ఞతలు” అని తెలిపారు.
మంచు విష్ణు ఇచ్చిన ఈ అప్డేట్‌తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో క్షిపణుల శబ్దాలకు తన చిన్న కుమార్తె భయపడిందని చెప్పడంతో ఆందోళన వ్యక్తమైనప్పటికీ, ఇప్పుడు తాము క్షేమంగా ఉన్నామని చెప్పడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆయన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
To everyone concerned about our safety, thank you. 🙏
— Vishnu Manchu (@iVishnuManchu) March 2, 2026
We are safe in Dubai. The family is safe. Aside from occasional distant sounds, life continues with calm and order.
In tense times, what stands out is the quiet efficiency and brilliant preparedness on the ground. Grateful…





