HomeMovie News Teluguవారణాసి నుంచి బిగ్ అప్డేట్..

వారణాసి నుంచి బిగ్ అప్డేట్..

బాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘ది బ్లఫ్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ మంచి స్పందన అందుకుంటోంది. ఈ సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రాజమౌళి సోషల్ మీడియాలో స్పందిస్తూ, “ప్రియాంక చోప్రా ఒక క్షణంలో సున్నితంగా, మరో క్షణంలో శక్తివంతంగా కనిపించగల అరుదైన నటీమణి. ‘ది బ్లఫ్’ ఆమె ప్రతిభకు మరో నిదర్శనం. సినిమాలో యాక్షన్ స్టంట్స్ అద్భుతంగా ఉన్నాయి” అంటూ ప్రశంసించారు.

ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమాపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. “యాక్షన్, ఎమోషన్స్ సమపాళ్లలో ఉన్న సినిమా ఇది. ప్రియాంక తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. మొత్తం టీమ్‌కు అభినందనలు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే మహేష్ బాబు చేసిన ఈ పోస్టుకు ప్రియాంక చోప్రా ఇచ్చిన రిప్లై ఇప్పుడు అభిమానులకు అసలైన సర్‌ప్రైజ్‌గా మారింది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ (SSMB29)లో ప్రియాంక కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మహేష్‌కు రిప్లై ఇస్తూ ప్రియాంక, “థాంక్యూ మై ఫ్రెండ్.. త్వరలోనే అంటార్కిటికాలో కలుద్దాం” అని పేర్కొన్నారు. ఈ ఒక్క కామెంట్‌తోనే ‘వారణాసి’ సినిమా తదుపరి షెడ్యూల్ అంటార్కిటికాలో జరగబోతుందనే విషయం బయటపడింది. మంచు కొండల మధ్య షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. జక్కన్న ప్లానింగ్ మరోసారి నెక్స్ట్ లెవెల్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అప్డేట్ మహేష్ ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular