HomeMovie News Telugu‘ధురంధర్ 2’ vs ‘టాక్సిక్’.. రన్‌టైమ్‌లోనూ పోటీ!

‘ధురంధర్ 2’ vs ‘టాక్సిక్’.. రన్‌టైమ్‌లోనూ పోటీ!

సినిమా రన్‌టైమ్ మూడు గంటలు దాటితే అది మేకర్స్‌కు పెద్ద సవాల్‌గా మారుతుంది. ఎక్కువ నిడివి ఉన్న సినిమా ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు ఆకట్టుకుంటేనే విజయాన్ని అందుకుంటుంది. కథ ఎక్కడైనా నెమ్మదిస్తే ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో, చాలామంది దర్శకులు తక్కువ రన్‌టైమ్‌తో సినిమాలను తీసుకురావడానికే ప్రాధాన్యం ఇస్తుంటారు.

అయితే ఇటీవల స్టార్ హీరోల సినిమాలు మాత్రం మూడు గంటలకు సమీపంగా లేదా అంతకంటే ఎక్కువ నిడివితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆశ్చర్యకరంగా అలాంటి సినిమాల్లో చాలావరకు మంచి విజయాలు కూడా సాధిస్తున్నాయి.

ఈ సమ్మర్ కానుకగా మార్చి 19న రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’, యాష్ హీరోగా రూపొందుతున్న ‘టాక్సిక్’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సినిమాలపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పుడు ఈ రెండు చిత్రాలు కేవలం రిలీజ్ డేట్ విషయంలోనే కాకుండా రన్‌టైమ్ విషయంలో కూడా పోటీ పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సమాచారం ప్రకారం ‘ధురంధర్ 2’ సినిమా దాదాపు 3 గంటల 40 నిమిషాల నిడివితో రానుండగా, ‘టాక్సిక్’ మూవీ సుమారు 3 గంటల 15 నుంచి 3 గంటల 25 నిమిషాల రన్‌టైమ్‌తో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో ఈ రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, రన్‌టైమ్ పరంగా కూడా ఆసక్తికర పోటీని సృష్టిస్తున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రేక్షకులు ఈ లాంగ్ రన్‌టైమ్ సినిమాలను ఎలా రిసీవ్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular