HomeMovie News Teluguట్రోలర్స్‌కు రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్..

ట్రోలర్స్‌కు రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్..

సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్‌పై నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం గురించి జరుగుతున్న విమర్శలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస వీడియోలు షేర్ చేశారు.

“2012లో నేను విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు నా పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. నా డివోర్స్, భరణం, నేను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అనే విషయాల వరకు అన్నింటిలోనూ నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఇక చెప్పడానికి ఏమీ మిగలలేదనుకున్నా, విమర్శలు మాత్రం ఆగడం లేదు” అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల వీధి కుక్కల సంరక్షణపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా ప్రచారం చేశారని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. వందల సంఖ్యలో కుక్కలను చంపుతున్న ఘటనలు చూసి బాధపడి, కొన్ని ఎన్జీవోల అభ్యర్థన మేరకు తాను ప్రెస్ మీట్‌కు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. మొదట విమర్శలు వస్తాయని తెలిసి వెళ్లడానికి నిరాకరించినా, పరిస్థితి తీవ్రతను చూసి పాల్గొన్నానని చెప్పారు.

“వంద కుక్కల్లో కొన్నే ప్రమాదకరంగా ఉండొచ్చు. వాటి విషయంలో జాగ్రత్తలు అవసరం. కానీ అందుకు మిగిలిన కుక్కలన్నింటినీ చంపడం సరైంది కాదు. నేను చెప్పింది ఇదే” అంటూ ఆమె స్పష్టత ఇచ్చారు. మనుషులు తప్పు చేసినా, జంతువులు చేసినా తప్పే అని తాను చెప్పానని గుర్తుచేశారు.

తాను చెప్పిన అసలు విషయాన్ని వక్రీకరించి కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా పేజీలు అసభ్యకర పోస్టులు చేస్తున్నాయని రేణు దేశాయ్ మండిపడ్డారు. తన క్యారెక్టర్‌ను కించపరిచేలా వ్యవహరిస్తే ఊరుకోనని హెచ్చరిస్తూ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular