HomeMovie News Teluguపుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన దురంధర్..

పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన దురంధర్..

‘దురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద చూపిస్తున్న ఊపు చూస్తే.. ఇది రికార్డులు బద్దలుకొట్టడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ 300 కోట్ల క్లబ్‌ను దాటి స్టేబుల్‌గా వసూళ్లు సాధిస్తోంది. వేగంగా 500 కోట్ల మార్క్‌ను టచ్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా విడుదలైన రెండో శుక్రవారం రోజున ‘పుష్ప 2’ (రూ.27.5 కోట్లు) రికార్డును బ్రేక్ చేయడం విశేషం. ఆ రోజు ‘దురంధర్’ రూ.34 కోట్ల గ్రాస్ వసూలు చేసి కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌తో పాటు టియర్-2 నగరాల్లోనూ ఈ సినిమా బలమైన వసూళ్లు రాబడుతుండటం ట్రేడ్‌కు పాజిటివ్ సిగ్నల్‌గా మారింది.

నిజానికి ఈ సినిమా ఇంత భారీ స్థాయిలో దూసుకెళ్తుందని దర్శకుడు ఆదిత్య ధర్ కానీ, హీరో రణ్‌వీర్ సింగ్ కానీ ముందుగా ఊహించలేదనే మాట వినిపిస్తోంది. కానీ దేశభక్తి, తీవ్రవాదం వంటి ఎలిమెంట్స్ ప్రేక్షకులతో బలంగా కనెక్ట్ కావడం.. అలాగే సరైన టైమింగ్‌లో రిలీజ్ కావడం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. ఈ ఊహించని సక్సెస్‌తో ఇప్పుడు ‘దురంధర్ 2’పై అంచనాలు పదింతలు పెరిగాయి. సీక్వెల్ స్కేల్, కాన్వాస్ మొదటి భాగం కంటే చాలా పెద్దదిగా ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

నిజానికి ‘దురంధర్’ ఎండ్ కార్డ్స్‌లోనే సీక్వెల్‌ను మార్చి 2026లో విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇప్పుడు మొదటి భాగం సాధించిన భారీ విజయం అన్నీ ప్లాన్లను మార్చేస్తోంది. ఇంకా కొంత షూటింగ్ పెండింగ్‌లో ఉండటంతో పాటు, మారిన స్కేల్‌కు తగ్గట్టు సీక్వెల్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘పుష్ప’ విజయం తర్వాత సుకుమార్ ఎలా సీక్వెల్‌ను భారీ స్థాయికి తీసుకెళ్లాడో.. అదే తరహాలో ‘దురంధర్ 2’ కూడా కంటెంట్, బడ్జెట్, స్పాన్ పరంగా పూర్తిగా అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే మార్చి రిలీజ్‌కు బదులుగా ఆగస్టు 2026కి వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘దురంధర్ 2’ ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాచ్‌డ్ సీక్వెల్‌గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular