HomeMovie News Teluguరివైండ్‌2025: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవే

రివైండ్‌2025: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవే

2025 ఇయర్ ముగియనుంది. కొత్త ఏడాది వచ్చేస్తుంది. ఈ ఏడాది టాలీవుడ్ లో చాలా బ్లాక్ బస్టర్ మూవీస్ ఆడియన్స్ ను అలరించాయి. కొన్ని భారీ అంచనాలతో వచ్చినా నిరాశపరిచాయి. డిజాస్టర్ సినిమాల గురుంచి పక్కన పెడితే హిట్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. 2025 జనవరిలోనే టాలీవుడ్ కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చింది. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ మూవీ 300 కోట్లు కలక్షన్లతో రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఫిబ్రవరిలో ‘తండేల్’ మూవీ హిట్ తెచ్చింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీని చందు మొండేటి తెరకెక్కించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా హెల్ప్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తరువాత నాని నిర్మాణంలో ‘కోర్ట్’ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. ఫోక్సో చట్టం గురించి అవగాహన కల్పిస్తూ వచ్చిన ఈ కోర్టు డ్రామాకి లవ్ స్టోరీ కూడా యాడ్ చేసి ప్రేక్షకులని అలరించారు మేకర్స్. కోర్టు మూవీతో నిర్మాతగా హిట్ కొట్టిన నాని తరువాత ‘హిట్ 3 ‘ తో హీరోగా బ్లాక్ బస్టర్ కొట్టాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 100 కోట్ల కలెక్షన్స్ తో నాని కెరీర్ లో మరో హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది.

‘కుబేర’ మూవీ టాలీవుడ్ కి ఇంకొంచెం ఊతమిచ్చింది. నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర 100 కోట్లకు పైగా వసూళ్లుతో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ భారీ హిట్ కాకపోయినా పరవాలేదనిపించుకుంది. తేజా సజ్జా నటించిన ‘మిరాయ్’ బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ తో ఇంకొక పాన్ ఇండియా హిట్ కొట్టాడు. డివోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన మిరాయ్ టాలీవుడ్ కి ఇంకొక బ్లాక్ బస్టర్ అందించింది. పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ హరి హర వీరమల్లు మెప్పించలేకపోయినా నెక్స్ట్ వచ్చిన ‘ఓజీ’ సూపర్ హిట్ అందుకుంది. గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన OG ని సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కించాడు. పవన్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టినట్టు ఉంది OG . కలక్షన్ల పరంగా కూడా దూసుకుపోయింది. 300 కోట్ల పైగా వసూళ్లతో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ ఏడాది ముగింపులో అదిరిపోయే హిట్ కొట్టారు బాలయ్య. అఖండ 2 తో బాలకృష్ణ, బోయపాటి ఇంకొక హిట్ కొట్టారు. ఇప్పటికే వీరిద్దరి ఖాతాలో హ్యటిక్ హిట్స్ ఉండగా మళ్ళీ రికార్డ్స్ కోసం దండయాత్ర మొదలు పెట్టింది ఈ ద్వయం. బాలయ్య కెరీర్ లోనూ, 2025 టాలీవుడ్ సినిమాల లిస్ట్ లోనూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అఖండ 2.

You May Like This
- Advertisment -spot_img

Most Popular