back to top
Thursday, February 12, 2026
spot_img
HomeMovie News Teluguటార్గెట్ రూ.1000 కోట్లు

టార్గెట్ రూ.1000 కోట్లు

ఒకప్పుడు 100 కోట్ల బడ్జెట్, వసూళ్లు అంటే అదో రికార్డ్. బడ్జెట్ కూడా 100 కోట్లు అంటే భారీ పెట్టుబడి కిందకి వచ్చేది. టాలీవుడ్ లో 100 కోట్ల సినిమా అంటే మాములు విషయం కాదు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. 100 దాటి 500 కి చేరింది. తరువాత 1000 కోట్ల టార్గెట్ గా మారింది. బడ్జెట్ పెరిగింది. కలక్షన్లు పెరిగాయి. ‘బాహుబ‌లి1,2 , ఆర్ ఆర్ ఆర్’, ‘పుష్ప‌’, ‘క‌ల్కి 2898 ‘ మూవీస్ అన్నీ 1000 కోట్లకు పైగా వ‌సూళ్లతో ఇండియ‌న్ బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. పుష్ప2 మూవీ సుమారు 1800 కోట్లు వసూలు చేసింది. బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసి, దంగల్ రికార్డ్ వరకు వెళ్ళింది. అందుకే రాబోయే తెలుగు సినిమాల టార్గెట్ 2000 కోట్ల‌గా మారింది.

రానున్న సినిమాలు కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవే. వీటిలో ‘వారాణసి’ మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో వస్తున్న వారాణసి పై గ్లోబల్ వైడ్ భారీ అంచనాలున్నాయి. వారాణసి మూవీ బడ్జెట్ 700 కోట్లు పైమాటే అని తెలుస్తోంది, టార్గెట్ 2000 కోట్లు అని టాక్. నెక్స్ట్ #AAA కూడా సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అంటే వసూళ్ల టార్గెట్ కూడా అదే రేంజ్ లో ఉంది. 2026 లో 1000 కోట్ల వసూళ్లు టార్గెట్ లో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న ‘ది రాజాసాబ్’ మూవీ రిలీజ్ కానుంది. సంక్రాంతి కానుక‌గా డిసెంబరు 9 న బరిలోకి దిగుతున్నాడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన రాజాసాబ్ స‌స్పెన్స్ కామెడీ థ్రిల్ల‌ర్ జోనర్ లో వస్తోంది. ప్రభాస్ మూవీకి వరల్డ్ వైడ్ గా ఉన్న క్రేజ్ కారణంగా ఈజీగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుదని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

మార్చి లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న ‘పెద్ది’ రిలీజ్ అవుతోంది. మొదటి సినిమా ఉప్పెనతో నేషనల్ అవార్డు అందుకున్న బుచ్చిబాబు సానా పెద్ది మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా పెద్ది రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ గ్లింప్స్ తో పాజిటీవ్ బజ్ వచ్చింది. అంతే కాక చెర్రీకి అన్ని భాషల్లో మార్కెట్ ఉంది. అందుకే పెద్ది 1000 కోట్ల టార్గెట్ గా బరిలో దిగుతోంది. 2026 లోనే ప్ర‌భాస్ ‘పౌజీ’ కూడా రిలీజ్ కానుంది. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పీరియాడిక్ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. ఫౌజీ కూడా 1000 కోట్ల టార్గెట్ తో బరిలో నిలుస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular