మంచు మనోజ్ లాంగ్ గ్యాప్ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఈ సారి హీరోగానే కాకుండా విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చినవే భైరవం, మిరాయ్ .ఈ సినిమాలతో మనోజ్ గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. మిరాయ్‌లో మనోజ్ చేసిన నెగెటివ్ రోల్ కి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు లభించాయి. ఇక మనోజ్ విలన్ గా సెటిల్ అయిపోవచ్చు అనుకుంటున్న టైం లో హీరోగా డేవిడ్ రెడ్డి మూవీ చేస్తున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం డేవిడ్ రెడ్డిలో రెండు స్పెషల్ క్యామియో రోల్స్ ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో ఒక రోల్ కోసం తమిళ స్టార్ హీరో శింబుని రంగం లోకి దింపుతున్నాడట మనోజ్. శింబుతో మనోజ్ కి ఉన్న అనుబంధం వలన శింబు కూడా నో చెప్పలేదట. ఇంకో రోల్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని అప్రోచ్ అవుతున్నాడట మనోజ్. పాన్ ఇండియా హీరో అయిన చెర్రీ తన మూవీలో నటిస్తే మంచి హైపు వస్తుంది. ఆటోమేటిక్ గ్గా మూవీ పై అంచనాలు నెలకొంటాయని మనోజ్ నమ్మకం. మనోజ్- చెర్రీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే మనోజ్ కూడా ఆశపడుతున్నాడట.
చెర్రీ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైం లో గెస్ట్ రోల్స్, క్యామియోస్ చేస్తాడా ? పైగా మనోజ్ మూవీలో. అందులో చెర్రీకి ఏం కలిసి వస్తుంది అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. మనోజ్ తో ఉన్న స్నేహం కారణంగా తన పాత్ర బాగుంటే చెర్రీ నో చెప్పే ఛాన్స్ ఉండదని కూడా వినిపిస్తోంది. పైగా తన వలన మనోజ్ కి మేలు జరుగుతుంది, కెరీర్‌కు హెల్ప్ అవుతుంది అంటే చెర్రీ కూడా ఓకే చెప్తాడని అంచనా వేస్తున్నారు. డేవిడ్ రెడ్డి ఒక పీరియడ్ ఫిలిం అని, బ్రిటిష్ వాళ్ల మీద పోరాడిన ఒక యోధుడి కథ అని టాక్.





