back to top
Thursday, February 12, 2026
spot_img
HomeMovie News Telugu2026 లో శ్రీలీల సత్తా చాటేనా ?

2026 లో శ్రీలీల సత్తా చాటేనా ?

పెళ్లి సందడి సినిమాతో ప్రభంజనంలా దూసుకు వచ్చిన శ్రీలీల వరుస ఆఫర్స్ అందుకుంది. కుర్రహీరోలతోనే కాకుండా సీనియర్ హీరోలతోనూ నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపింది. అవకాశాలు వచ్చాయి కానీ హిట్స్ కరువయ్యాయి. ఒకటి అరా హిట్స్ తప్ప అన్నీ డిజాస్టర్లు కావటంతో శ్రీలీల కెరియర్ డేంజర్ లో పడింది. దీనితో అమ్మడు కొంచెం బ్రేక్ ఇచ్చి స్టడీస్ పై ద్రుష్టి పెట్టింది. టైం కలిసొచ్చి శ్రీలీలకి పుష్ప 2 లో ఐటెం సాంగ్ కి చిందేసే ఆఫర్ వచ్చింది. కిస్సిక్ సాంగ్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది శ్రీలీల.

కానీ కథ మామూలే. మళ్ళీ డిజాస్టర్లే మిగిలాయి. నితిన్ తో కలిసి నటించిన ‘రాబిన్ హుడ్’, రవి తేజ తో చేసిన ‘మాస్ జాతర , కిరీటి తో చేసిన ‘జూనియర్’ అన్నీ ప్లాఫ్ లే. మళ్ళీ శ్రీలీల కెరియర్ అయోమయంలో పడింది. అందం, అభినయం, డాన్స్, వీటితో పాటు తెలుగమ్మాయి అని శ్రీలీల కి ఛాన్స్ లు వస్తున్నాయి. కానీ సెలక్షన్ లో పప్పులో కాలేస్తోంది అమ్మడు. 2025 లో ఒక హిట్ కూడా అందుకొని శ్రీలీల 2026 లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందేమో అని ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం శ్రీలీల చేతిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ఉంది. పవన్ కళ్యాణ్ కి జోడీగా నటిస్తోంది. ఈ మూవీ పై శ్రీలీల భారీ ఆశలు పెట్టుకుంది. తెలుగులో ఈ ఒక్క సినిమా మాత్రమే చేస్తోంది. తమిళంలో శివ కార్తికేయన్ తో ‘పరాశక్తి ‘, బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో ‘ఆషీకీ 3 ‘, ఆయుష్మాన్ ఖురాన్ తో ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. శ్రీలీల బాలీవుడ్ లో పాగా వేసేందుకే కొన్ని తెలుగు సినిమాలనుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అఖిల్ ‘లెనిన్’, విజయ్ దేవరకొండ మూవీ తో పాటు మరికొన్ని వదులుకున్నట్లు టాక్. 2026 లో శ్రీలీల హిట్ కొడితేనే టాలీవుడ్ లో తన స్థానం పదిలంగా ఉంటుందని విశ్లేషకుల వాదన.

You May Like This
- Advertisment -spot_img

Most Popular