HomeTeluguశంభాల మూవీ రివ్యూ & రేటింగ్

శంభాల మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం: శంభాల: ఎ మిస్టికల్ వరల్డ్
దర్శకత్వం: యగంధర్ ముని
కథ – రచన: యుగంధర్ ముని

నటీనటులు: ఆది సాయి కుమార్ , అర్చన అయ్యర్, శ్వాసిక విజయ్, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్, ప్రియ, ఆనంద్, సిజ్జు ఇంద్రనీల్, ప్రవీణ్, మీసాల లక్ష్మణ్, హర్షవర్దన్ తదితరులు.

నిర్మాతలు: రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి

సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కే బండారి
ఎడిటర్: శ్రవణ్ కటికనేని

బ్యానర్: షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌
విడుదల తేదీ: 25 డిసెంబరు 2025

సాయికుమార్ వారసుడు ఆది సాయి కుమార్ లాంగ్ గ్యాప్ తరువాత ‘శంబాలా’ సినిమాతో వస్తున్నాడు. గత కొంత కాలంగా ఆది కి సరైన హిట్ లేదు. అర్జెంట్ గా ఒక్క హిట్ పడకపోతే ఆది కెరియర్ డేంజర్ లో పడుతుంది. అందుకే ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. శంబాలా లాంటి మిస్టరీయస్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా పాజిటీవ్ బజ్ క్రియేట్ చేసిన శంబాలా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో సందడి చేస్తోంది. సైన్స్ & దేవుడి మధ్య జరిగిన పోరాటం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

శివుడు, అంధకాసురుడు మధ్య జరిగిన యుద్ధం గురించి చెప్తూ కథ మొదలవుతుంది. 1980లో శంబాలా అనే ఊరిలో జరిగిన కథ ఇది. శంబాలా లో ఒకరోజు అర్ధరాత్రి ఆకాశం నుంచి ఉల్క వచ్చి పడుతుంది. తరువాత ఊళ్లోకి ఒక భూతం వస్తుంది. తరువాత జరిగిన వింత సంఘటనలతో ఊరి జనం భయబ్రాంతులకు గురి అవుతుంటారు. ఈ సంఘటనలకి కారణం ఉల్క ఆకాశం నుంచి పడటం అని, అందుకే ఎదో భూతం కూడా ఊరిని ఆవహించిందని ఊరి ప్రజలు అనుకుంటారు. ఉల్క ఇక్కడ పడిందని తెలుసుకొన్న జియాలజీ డిపార్ట్మెంట్ కి చెందిన విక్రమ్(ఆది) శంబాలాకి వస్తాడు. ఊరి వారి మూర్ఖత్వాన్ని అడ్డుకుంటూ, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఉల్క పడిన చోట ఒక గుహని చూస్తాడు. ఆ గుహలో ఒక అస్థిపంజరాన్ని గుర్తిస్తాడు. విక్రమ్ వెంట ఉంటూ కానిస్టేబుల్ హనుమంతు (మధునందన్) హెల్ప్ చేస్తాడు. ఆదికి అదే ఊళ్ళో ఉండే దేవి(అర్చన అయ్యర్)తో పరిచయం అవుతుంది. ఊరిలోకి వచ్చిన దుష్ట శక్తి ఒకరి శరీరం నుంచి ఇంకొకరి శరీరంలోకి ప్రవేశిస్తూ ఊరి వారిని చంపుతూ ఉంటుంది. అసలు శంబాలా లో ఏం జరిగింది? ఉల్క పడటం ఏంటి ? భూతం ఆ ఊరిలోకి ఎందుకు ? ఎలా ? వచ్చింది. భూతం వెనుక కథ ఏంటి? భూతం ఎందుకు అందర్నీ చంపేస్తుంది? గుహలో ఉన్న అస్థిపంజరం ఎవరిది? కేవలం సైన్స్ ని మాత్రమే నమ్మే విక్రమ్ చివరికి దేవుడ్ని నమ్మాడా? ఈ కథలో దేవి పాత్ర ఏంటి ? ఈ కథకి శివుడు – అంధకాసురుడు కథతో సంబంధం ఏంటో తెలియాలంటే శంబాలా తెరపై చూడాల్సిందే..

విశ్లేషణ:

దేవుడు, సైన్స్ మధ్య జరిగే పోరు ఎప్పుడు ఆసక్తిగానే ఉంటుంది. దర్శకుడు యుగంధర్ ముని అందుకే ఈ పాయింట్ తీసుకున్నాడు అనిపిస్తుంది. ఇంతకు ముందు వచ్చిన కథల్లానే సైన్స్ గొప్ప అనే హీరో, అన్నీ సైన్స్ కి సంబధించినవి కావు ఇంకేదో ఉందని నమ్మే జనం. ఈ రెండు నమ్మకాల మధ్య జరిగిన కథే శంబాల. శివుడు, అంధకాసుర కథ చెప్తూ సినిమా మొదలుపెట్టి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాడు. ప్రారంభంలోనే అసలు కథ చెప్పేసాడు. ఇంటర్వెల్ వరకు ప్రతి సీన్ ఆసక్తిగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ రివీల్ అయ్యాకా స్క్రీన్ ప్లే మరింత స్పీడ్ అందుకుంది. సైన్స్ ని మించింది ఎదో ఉందని బలంగా నమ్మే సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. దుష్టశక్తుల ఆవహించిన మనిషి చేసే వికృత చేష్టలు, వాటిని ఆపలేని ఊరి జనం, ఈ రెండిటితో హీరో చేసే పోరాటం, సీక్రెట్ గా దేవత చేసే సాయం లాంటి సీన్స్ తో శంభాల కొత్తగా ఉంది. క్లైమాక్స్ చాలా బాగా పండింది. అంతవరకు ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకుడికి ఒక మంచి ముగింపు ఇచ్చాడు దర్శకుడు. సీక్వెల్ హింట్ ఇస్తూ కథని ముగించాడు.

నటీ నటులు:

చాలా కాలం తరవాత ఆది మంచి సబ్జెక్ట్ తో ఆడియన్స్ ని అలరించాడు. సైంటిస్ట్ పాత్రలో ఒదిగిపోయాడు ఆది. యాక్షన్ సీన్స్ లో కూడా ఫుల్ మార్క్స్ కొట్టేసాడు. అర్చన అయ్యర్ కి నటనకి స్కోప్ ఉన్న పాత్ర పడింది. మధు నందన్ కానిస్టేబుల్ పాత్రలో మెప్పించాడు. మీసాల లక్ష్మణ్ తన నటనతో నవ్వులు పూయించాడు. స్వసిక, రవి వర్మ, ఇంద్రనీల్, సిజ్జు, శైలజ ప్రియా వారి పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఆటిజం డిసీజ్ ఉన్న పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నటనని మెచ్చుకొవాల్సిందే.

టెక్నికల్ :

శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథని మరింత హైలెట్ చేసింది. కొన్ని సీన్స్ ని బీజీఎమ్ ద్వారా ఎలివేట్ చేశారు శ్రీచరణ్. ప్రవీణ్ కే బండారి సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ కరక్ట్ గా ఉంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. కథని నమ్మి నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు.

*ప్లస్ పాయింట్స్

ఆది
సంగీతం
కథ, కథనం
విజువల్స్

*మైనస్ పాయింట్స్

కొన్ని బోరింగ్ సీన్స్
పెద్దగా మలుపులు లేకపోవటం

You May Like This
- Advertisment -spot_img

Most Popular