back to top
Thursday, February 12, 2026
spot_img
HomeMovie News Teluguవార‌ణాసిలో మ‌రో స‌ర్‌ప్రైజ్‌

వార‌ణాసిలో మ‌రో స‌ర్‌ప్రైజ్‌

మ‌హేష్ బాబు – రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న క్రేజీ చిత్రం ‘వార‌ణాసి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ప్ర‌స్తుతం శ‌ర వేగంగా సాగుతోంది. ఇందులో మ‌హేష్ తో పాటుగా ప్రియాంకా చోప్రా, ఫృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టిస్తున్నారు. వీళ్ల‌కు సంబంధించిన లుక్స్ కూడా బ‌య‌ట‌కు వచ్చేశాయి. ఈ ముగ్గురు తప్ప ఈ చిత్రంలో ఇంకెవ‌రు న‌టిస్తున్నారన్న విష‌యంలో చిత్ర‌బృందం స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ‘వార‌ణాసి’లో మాధ‌వ‌న్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని, ఆయ‌న‌ హ‌నుమంతుడిగా క‌నిపించే అవ‌కాశాలు ఉన్నాయ‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే చిత్ర‌బృందం మాత్రం ఈ విష‌యంలో నోరు మెద‌ప‌డం లేదు.

ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌ట‌కు వచ్చింది. ఈ సినిమా కోసం సీనియ‌ర్‌ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ని తీసుకొన్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న‌ మ‌హేష్ తండ్రిగా క‌నిపించ‌బోతున్నార‌ని స‌మాచారం. రాజ‌మౌళి సినిమాలో ప్ర‌కాష్ రాజ్ న‌టించ‌డం ఇది రెండోసారి. ఇది వ‌ర‌కు విక్ర‌మార్కుడు చిత్రంలో ఆయ‌న ఓ కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ సినిమాలో ప్ర‌కాష్ రాజ్ క‌నిపిస్తే ఆ సినిమా సూప‌ర్ హిట్టే. రాజ‌కుమారుడు, ఒక్క‌డు, దూకుడు, సీత‌మ్మ వాకిట్లో… ఈ సినిమాల్లో ప్ర‌కాష్ రాజ్ న‌టించారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఈసినిమాతోనూ రిపీట్ అయ్యే ఛాన్సుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular