నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, డిసెంబర్ 11 రాత్రి పెయిడ్ ప్రీమియర్లతో హంగామా మొదలు పెట్టింది.
తాజాగా చిత్ర బృందం అధికారికంగా తొలి రోజు వసూళ్లను ప్రకటించింది. స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ లెక్కల ప్రకారం, అఖండ 2 వరల్డ్ వైడ్‌గా రూపాయి 59.5 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రీమియర్లతో కలిపి వచ్చిన ఈ భారీ ఫిగర్, బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఈ దూకుడు వీకెండ్‌వరకు కొనసాగుతుందని ట్రేడ్ అంచనా. రెండో రోజు ప్రీ-బుకింగ్స్ కూడా బలంగా నమోదయ్యాయి.

బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ అంటేనే మాస్ ఆడియన్స్‌కు ప్రత్యేక క్రేజ్. సింహా, లెజెండ్, అఖండ తర్వాత ఈ కాంబోలో వచ్చిన నాలుగో చిత్రం అఖండ 2 కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించాడు. హర్షాలీ మల్హోత్రా, జగపతిబాబు, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
సినిమాకు తమన్ సంగీతం, సి. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం, తమ్మిరాజు ఎడిటింగ్ బలాన్ని చేకూర్చాయి. బాలయ్య కుమార్తె ఎం. తేజస్విని నందమూరి ప్రెజెంటర్‌గా వ్యవహరించగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు.
ఇప్పుడు ఆసక్తి ఒక్కటే.. ‘అఖండ 2’ మొత్తం రన్‌లో ఎంత కలెక్షన్లు సాధిస్తుంది? వేచి చూడాలి!





