HomeTeluguఅఖండ-2 నిర్మాతలకు భారీ ఊరట

అఖండ-2 నిర్మాతలకు భారీ ఊరట

బాలకృష్ణ అఖండ-2 చిత్రానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. సినిమా నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ పెద్ద ఊరట ఇచ్చింది. సింగిల్ బెంచ్ జారీ చేసిన టికెట్ రేట్ల జీవో రద్దు ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ ఈ నెల 14 వరకు స్టే విధించింది. తదుపరి విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేసింది.

అఖండ-2 గురువారం ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఒక్కో టికెట్‌ను రూ.600కి విక్రయించారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతి మంజూరు చేశాయి. అయితే ఈ టికెట్ రేట్ల పెంపు జీవోపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో గురువారం హైకోర్టు సింగిల్ బెంచ్ ఆ జీవోను రద్దు చేసింది. అయినా కూడా శుక్రవారం సినిమా యథావిధిగా విడుదల అయి, హౌస్‌ఫుల్ షోలతో ముందుకు దూసుకెళ్లింది.

తాజాగా సింగిల్ బెంచ్ ఆదేశాలను అమలు చేయలేదంటూ మరో పిటిషన్ దాఖలయ్యింది. ఇదే సమయంలో నిర్మాతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా, ధర్మాసనం సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై తాత్కాలిక స్టే విధించింది. దీంతో అఖండ-2 టీమ్‌కు భారీ రిలీఫ్ లభించినట్లైంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular