HomeTelugu Reviews'మోగ్లీ' మూవీ రివ్యూ & రేటింగ్

‘మోగ్లీ’ మూవీ రివ్యూ & రేటింగ్

సినిమా: మోగ్లీ
కథ: సందీప్ రాజ్
దర్శకత్వం: సందీప్ రాజ్

న‌టీన‌టులు: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్, బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు గెస్ట్ రోల్స్ లో సుహాస్‌, రియా సుమ‌న్ త‌దిత‌రులు.

సంగీతం: కాలభైరవ
ఛాయాగ్ర‌హ‌ణం: రామ్ మారుతి
ఎడిటింగ్‌: కోదాటి పవన్ కల్యాణ్
నిర్మాత‌లు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్‌
బ్యాన‌ర్‌: పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ

విడుద‌ల‌: 2025 డిసెంబ‌రు 13

స్టార్ యాంకర్ సుమ కనకాల, రాజీవ్ కనకాల నటవారసుడు హీరోగా తెరంగేట్రం చేసి ‘బబుల్ గమ్’ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు . కమర్షియల్ హిట్ కొట్టకపోయినా పరవాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు మోగ్లీ మూవీతో సెకండ్ ప్రయత్నం చేస్తున్నాడు. ‘కలర్ ఫొటో’ మూవీతో ప్రేక్షకులని ఆకట్టుకున్న సందీప్ రాజ్ దర్శకత్వంలో మోగ్లీ మూవీ తెరకెక్కుతోంది. ఈ శనివారం థియేటర్స్ లో మోగ్లీ సందడి మొదలైంది. ఈ మూవీతో రోషన్ హిట్ కొట్టాడా ? టాలీవుడ్ లో బిజీ అయ్యే ఛాన్సులు అందుకుంటాడా లేదో ఈ రివ్యూలో చూద్దాం.

క‌థ‌
మోగ్లీ అలియాస్ మురళీకృష్ణ అనాథ. ఓ ప్రమాదంలో చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతాడు. తండ్రి పోలీస్ కావడంతో తాను కూడా పోలీస్ కావాలని ఆశపడతాడు. అందుకోసం ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు అడవిలో ఉండే మోగ్లీ సినిమాలకు లొకేషన్ కో ఆర్టినేటర్ గా పనిచేస్తాడు. అలా ఓ సినిమా షూటింగ్ కోసం వచ్చిన బృందంలో డాన్సర్ అయిన సాక్షి మడోల్కర్ తో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి మూగ, చెవిటి అని తెలిసి కూడా ప్రేమిస్తాడు. అయితే జాస్మిన్ పై పోలీస్ ఆఫీసర్ క్రిస్టోఫర్ నోలన్ కన్ను పడుతుంది. ఎలాగైనా ఆ అమ్మాయిని వశం చేసుకోవాలి అనుకుంటాడు. మోగ్లీ ఆమెను ప్రేమిస్తున్నాడని తెలిసి కావాలని తప్పుడు కేసులు బనాయిస్తాడు. మరోవైపు మోగ్లీ-జాస్మిన్ ను విడిదీసేందుకు ఇంకొకరు ప్లాన్ వేస్తారు. తనకు ఎదురైన అడ్డంకులను అధిగమించి ప్రేమను గెలుచుకున్నాడా? చివరకు జాస్మిన్ మోగ్లీ ఒక్కటయ్యారా లేదా అని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేష‌ణ‌
అడ‌వి నేప‌థ్యంలో సాగే ఓ లవ్ స్టోరీ. కథ పాతది కావటంతో కొత్త దనం కోసం నేప‌థ్యం, పాత్రల తీరుతెన్నులని మార్చాడు దర్శకుడు. ముఖ్యంగా కర్మఫ‌లం అనే విషయానికి ముడిపెట్టి. సీతారాములు, ఆంజనేయుడు, రావ‌ణుడికి లింక్ చేస్తూ ఈ లవ్ స్టోరీకి పురాణాన్నీ, భ‌క్తినీ మేళ‌వించారు. ఇప్పుడు ట్రెండ్ ప్రకారం డివోషనల్ టచ్ ఇస్తే సినిమా హిట్ అని అంతా నమ్ముతున్నారు. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా డివోషనల్ ఎలిమెంట్స్ ఇచ్చి ప్రేక్షకులని బుట్టలో వేయాలని చూస్తున్నారు. కానీ దర్శకుడి ప్రయత్నం వృధా అయ్యింది. కారణం కథలో లోపం. మాటలు , స్క్రీన్ ప్లే మెప్పించ లేకపోవటమే. అంచనాలకి తగ్గట్టు పాత్రలు నడుచుకుంటాయి. కొత్త దనం లేదు. ట్విస్ట్ లు లేవు. ప్రేక్షకులని కట్టి పడేసే ఎమోషన్స్ లేవు. అన్నిటికి మించి సినిమా నిడివి కూడా ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తుంది. లవ్ స్టోరీలు ఎన్ని వచ్చినా, చూపించే విధానం ఆకట్టుకునేలా ఉండాలి. మోగ్లీలో అది మిస్ అయ్యింది. హీరో, హీరోయిన్ల మ‌ధ్య ప్రేమ, ఆ త‌ర్వాత విరహం అన్ని కామన్ గా ఉన్నాయి. ఏ సీన్ చూసినా ఎదో ఒక సినిమా రిఫరెన్స్ కనిపిస్తుంది. అంతకి మించి ఏం మ్యాజిక్ చేయలేకపోయాడు దర్శకుడు. సైలెంట్ ల‌వ్‌స్టోరీ విత్ లౌడెస్ట్ వార్ అనౌన్స్ చేసి బ్రేక్ ఇచ్చాడు. కానీ సెకండ్ హాఫ్ కూడా మెప్పించలేకపోయాడు. విలన్ ఎంట్రీ తో కొంచెం స్పీడ్ అందుకున్న కథ కాసేపటికే రొటీన్ అయిపోతుంది. మూగ‌జీవితోనే నీ జీవితం అంతం అంటూ పండితుడు ప్ర‌తినాయ‌కుడిని శ‌పించే సీన్స్ తో శుభం కార్డు పడింది.

న‌టీన‌టులు
హీరోగా రోషన్ కనకాలకు ఇది రెండో సినిమా. ఎమోషనల్ సీన్స్ లో ఇంకా పరిణితి చెందాలి కానీ నటనపరంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఇక హీరోయిన్ గా సాక్షి మడోల్కర్ కి ఇదే ఫస్ట్ మూవీ. లుక్ బాగానే ఉంది నటన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక స్నేహితుడిగా నటించిన హర్ష చెముడు మరోసారి మ్యాజిక్ చేశాడు. తను స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకులను మెప్పించాడు. విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ ప్రేక్షకులను ఆకట్టున్నాడు.నటనలో బెస్ట్ ఇచ్చాడు. అయితే బండి పాత్రకు స్టార్టింగ్ లో ఇచ్చిన ఎలివేషన్ లాస్ట్ వరకూ కంటిన్యూ కాలేదు. ఓవరాల్ గా చెప్పుకుంటే దర్శక రచయితగా సందీప్ రాజ్ మెరుపులు మోగ్లీ లో ఉన్నాయి కానీ స్టార్టింగ్ నుంచి చివరి వరకూ ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టేలా లేదు. కొన్ని సన్నివేశాలు బావున్నాయి కానీ కథలో కొత్తదనం లేదు. క్లైమాక్స్, కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయ్. బండి సరోజ్ నటన చూడాల్సిందే.

సాంకేతిక వ‌ర్గం
దర్శక రచయితగా సందీప్ రాజ్ ఈ మూవీ విషయంలో ఒరిజనాలిటీకి కాస్త దూరంగానే ఉండిపోయాడు. షార్ట్ ఫిలిమ్స్ తీసేటప్పుడు రిఫరెన్సులు, సూపర్ హిట్ సీన్స్ రీ క్రియేషన్స్ చేయడం వరకూ ఓకే. కానీ సినిమా విషయంలోనూ ఇదే అనుసరిస్తానంటే ప్రేక్షకులు అంగీకరించరు. దర్శక రచయితగా కొత్తదనం చూపించాల్సిన అవసరం ఉంది. ఆ కొత్తదనమే మోగ్లీలో మిస్సైంది. మోగ్లీ 2025 సినిమా చూస్తున్నంతసేపూ జయం సినిమా చూస్తున్నామా అనిపిస్తుంది. హీరోని ప్రభాస్ అభిమానిగా చూపించడంవరకూ పర్వాలేదు కానీ ఛత్రపతిలో యాక్షన్ సీన్ ని గుర్తుచేసేలా క్లైమాక్స్ డిజైన్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. రొటీన్ కథ, క్యారెక్టర్ల సాగదీత వల్ల ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. రామ మారుతి కెమెరా వర్క్ బావుంది. అటవీ బ్యాక్ డ్రాప్ లో సన్నివేశాలు బాగా వచ్చాయి. సయ్యారే సాంగ్ తప్ప కాలభైవర సంగీతంలో ఎలాంటి మెరుపులు లేవు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు.

ప్ల‌స్ పాయింట్స్‌
విజివల్స్
కొన్ని సీన్స్

మైన‌స్ పాయింట్స్‌
రొటీన్ కథ
ఎమోషన్స్ పేలవంగా ఉండటం
సాగదీత

You May Like This
- Advertisment -spot_img

Most Popular