చిత్రం: మన శంకర వరప్రసాద్ గారు
దర్శకత్వం: అనీల్ రావి పూడి
కథ – రచన: అనీల్ రావి పూడి
నటీనటులు: మెగా స్టార్ చిరంజీవి, నయన్ తార, విక్టరీ వెంకటేష్, కేథరిన్, శరత్ సక్సేనా, సచిన్ ఖేడ్కర్, అభినవ్ గోమఠం, హర్షవర్ధన్, జరీన్ వహాబ్, రఘుబాబు, శ్రీనివాస రెడ్డి, హర్ష చెముడు, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా తదితరులు.
నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు
బ్యానర్: షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: 12 జనవరి 2026
రేటింగ్: 3.25/5
మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీ తర్వాత రెండేళ్ళకి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వస్తున్నారు. 2025 లో చిరు నటించిన విశ్వంభర రిలీజ్ కావల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. విశ్వంభర తరువాత మొదలు పెట్టిన శంకర్ వరప్రసాద్ మాత్రం పక్కాగా అనుకున్న టైం కి వచ్చేసింది. అపజయం లేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనీల్ రావి పూడి చిరు కాంబోలో వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనీల్ మార్క్ ఎంటర్ టైన్మెంట్ కి చిరు కామెడీ టైమింగ్ తోడయితే ఎలా ఉంటుదో చూడాలని మెగా ఫాన్స్ తో పాటు సినీప్రియులు వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి సంధర్భంగా థియేటర్స్ లో రిలీజైన మన శంకర్ వరప్రసాద్ ఎలా ఉందో, చిరు – అనీల్ అల్లరి ఎలా ఉందో ఈ రివ్యూ లో చూద్దాం .
కథ :
వరప్రసాద్ (చిరంజీవి) నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. సెంట్రల్ మినిస్టర్ దగ్గర చీఫ్ సెక్యూరిటీగా చేస్తుంటాడు. చూడటానికి చాలా సరదాగా ఉంటాడు, పవర్ ఫుల్ ఆఫీసర్, ఎలాంటి సిట్యుయేషన్ నైనా హ్యాండిల్ చేయగల సత్తా ఉన్నవాడు, కానీ లోపల ఎదో దిగులు, బాధ ఉంటుంది. ఆ బాధ కి కారణం భార్య శశి రేఖ ( నయన్ తార). ప్రేమించి పెళ్లి చేసుకున్న శశి రేఖ, వరప్రసాద్ మావ (సచిన్ ఖేడేకర్) కారణంగా ఈగో ఫీలింగ్స్ తో విడిపోతారు. వీరికి అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. ఆ పిల్లలని కూడా కలవనీయకుండా దూరం చేస్తుంది శశి రేఖ. ఏ ఫంక్షన్ కి వెళ్లినా తన పిల్లని గుర్తు చేసుకుని బాధ పడుతుంటాడు వరప్రసాద్. ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ వుమెన్ గా ఎదుగుతుంది శశిరేఖ. ఈ క్రమంలో తన మావగారి ఇంటికే సెక్యూరిటీ గా వెళ్తాడు వరప్రసాద్. ఫైనల్ గా మావ కారణంగా ముక్కలైన తన కాపురాన్ని ఎలా చక్కదిద్దుకున్నాడు? శశి రేఖ వరప్రసాద్ ని క్షమిస్తుందా ? పిల్లలు తండ్రిని ఆదరిస్తారా ? ఈ క్రమంలో వరప్రసాద్ పడ్డ అవస్థలు ఏంటి ? తనని కాదన్న ఇంటికే వరప్రసాద్ సెక్యూరిటీ గా ఎందుకు వెళ్ళాడు ? శశిరేఖ కుటుంబానికి ఉన్న ఆపద ఏంటి? దాని నుంచి వరప్రసాద్ ఎలా కాపాడాడు? వెంకీ గౌడ(వెంకటేష్) పాత్ర ఏంటి? లాంటి విషయాలు స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
అనీల్ రావిపూడి గత సినిమాల్లానే మన శంకర వరప్రసాద్ కూడా కామెడీ ఎంటర్ టైనర్. అనీల్ ఎప్పుడు నేల విడిచి సాము చేయడు. కథ కోసం అనవసర గందరగోళం సృష్టించడు. ఒక చిన్న పాయింట్ పట్టుకుని సినిమా మొత్తం కామెడీ వే లో తీసుకుని వెళ్ళటమే అనీల్ ప్రత్యేకత. తనని నమ్మి డబ్బులు పెట్టిన నిర్మాతని, ఆడియన్స్ ని శాటిస్ ఫై చేయటమే తన ధర్మం అన్నట్టు కథని ఎంటర్టైన్ చేస్తాడు. కథ చెప్పుకోవటానికి చాలా చిన్నది, రొటీన్ కాన్సెప్ట్. భార్యా భర్తలు విడిపోవటం, పిల్లలకోసం మళ్ళీ కలవాలనుకోవటం, ఈ క్రమంలో ముందు పిల్లలకి దగ్గరవడం కోసం చేసే ప్రయత్నాలు అన్నీ రొటీన్ కానీ ఇదే విషయాన్ని చెప్తూ రెండు గంటలు పాటు ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. స్టార్టింగ్ స్లో గా ఉన్నా తర్వాత అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్ కి చిరు ఎక్స్ప్రెషన్స్ తో ఫస్ట్ హాఫ్ సరదాగా గడిచిపోతుంది.
మెగా ఫాన్స్ కాలర్ ఎగరేసే కొన్ని సీన్స్, బాస్ మాస్, క్లాస్ ఎలివేషన్స్ బాగున్నాయి. చిరంజీవి వింటేజ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తూ, ఫైట్స్, డ్యాన్స్ ల తో కూడా అదరగొట్టారు. 70 ల్లో కూడా బాస్ ఊపు తగ్గలేదని నిరూపించారు. కథ లేదు అని ప్రేక్షకుడు ఫిల్ కాకుండా సక్సెస్ ఫుల్ గా నడిపించగలిగారు. సెకండ్ హాఫ్ లో అత్తవారింటికి చిరు షిఫ్ట్ అవటం, అక్కడ వచ్చే సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. శశిరేఖకు దగ్గర అవ్వడానికి వరప్రసాద్ చేసే ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బెడిసి కొట్టడం, వరప్రసాద్ మామ అల్లుడిని కూతురికి దూరం పెట్టే ప్రయత్నాలు అన్ని ఫన్నీ గా ఉన్నాయి. సెక్యూరిటీ పేరు చెప్పి తన మామని టీజ్ చేసే సీన్స్, అన్నీ చంటి అబ్బాయి, జై చిరంజీవ లో చిరు ని గుర్తు చేస్తాయి. ఇందువదన, కుందరదన డైలాగ్ టైమింగ్ బాగుంది. హోటల్ లో లేడీస్ మనస్తత్వం గురించి, అబ్బాయిల బాధలు గూర్చి చెప్పే సీన్ బాగుంది. చిరు టీమ్ కూడా కొంత కామెడీ చేసింది.
విలన్ ట్రాక్ ఈ కథకి పెద్దగా సెట్ అవలేదు. ఎదో ఒక లింక్ పెట్టాలని పెట్టినట్టు ఉంది. వెంకటేష్ ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉంది. వెంకీ ఎనర్జిటిక్ గా ఉన్నాడు. తన సినిమాలకి కూడా ఎప్పుడు ఇంతలా కాలు కదపని వెంకీ వరప్రసాద్ లో చిరు సాంగ్స్ కి డాన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు. వెంకీ ఒక పాట, ఫైట్ లో సందడి చేసారు. చిరంజీవి, వెంకటేష్ కలిసి ఉన్న సీన్స్ తో ఫాన్స్ కి ఒక టికెట్ పై రెండు సినిమాలు చూసినట్లు అయ్యింది. ట్విస్ట్ లు, భారీ సీన్స్, హీరో ఎలివేషన్స్ అని గందరగోళం సృష్టించకుండా ఈజీగా కథని నడిపించాడు దర్శకుడు అనీల్ రావిపూడి. మెగాస్టార్ లాంటి సీనియర్ హీరో ఇలాంటి ఫ్యామిలీ డ్రామాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తన ఇమేజ్ ని పక్కన పెట్టి దర్శకుడు ఏది చెబితే అది చేసారు. శంకర్ దాదా, జై చిరంజీవా లాంటి సినిమాల తరువాత చిరు నుంచి వచ్చిన పూర్తి ఎంటర్ టైనర్ వర ప్రసాద్ .
నటీ నటులు:
శంకర వరప్రసాద్ పాత్రలో చిరంజీవి అదరగొట్టారు. ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించి సర్ ప్రైజ్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ రోల్ కి తగ్గట్టు ఫిట్ గా ఉన్నారు చిరు. సెక్యూరిటీ ఆఫిసర్ గా, భార్యపిల్లలకు తిరిగి దగ్గరవ్వాలనుకునే ఒక సాధారణ వ్యక్తిగా చిరు నటన అదిరింది. ఎమోషనల్ సీన్స్ లోను చిరు అలవోకగా నటించారు. చిరు కామెడీ టైమింగ్స్ ఫాన్స్ ఫిదా అవుతున్నారు. వింటేజ్ లుక్స్, యాక్షన్, డ్యాన్సుల్లో చిరు వాహ్ అనిపించారు. శశిరేఖ పాత్రలో నయనతార హుందాగా ఉంది. కానీ నయన్ కి ఇది రొటీన్ రోల్ అని చెప్పొచ్చు. అజిత్ ‘విశ్వాసం’ , వెంకటేష్ ‘తులసి’ సినిమాల్లో నయనతార పాత్రలు ఇలానే ఉంటాయి. చిరు నయన్ జోడీ బాగుంది.
కర్ణాటక బిజినెస్ మ్యాన్ వెంకీ గౌడగా వెంకటేష్ ఎంట్రీ అదిరింది. వెంకీ స్క్రీన్ ప్రెజెన్సీ తక్కువ ఉన్నా ప్రేక్షుకులని ఆకట్టుకుంది. చిరు-వెంకీ కామెడీ, డాన్స్ ఫ్యాన్స్ కి డబుల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. నయన తార తండ్రి పాత్రలో సచిన్ ఖేడేకర్ నటన బాగానే ఉంది. శంకర్ దాదా సినిమాలో పరేష్ రావల్ ని గుర్తు చేసారు సచిన్. కేథరిన్ థెరిస్సా స్టయిల్ గా ఉంది. స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువే ఉంది. చిరు టీమ్ మెంబర్స్ గా హర్షవర్ధన్, అభినవ్ గోమఠం బాగానే నవ్వించారు. ముగ్గురు మొనగాళ్లు సినిమాలో విలన్ గా నటించిన శరత్ సక్సేనా ఈ మూవీలో చిరుకి ఆప్తుడిగా కనిపించారు. శ్రీనివాసరెడ్డి, హర్ష చెముడు ఒక్క సీన్ లో కనిపించారు. మాస్టర్ రేవంత్ నటన కూడా బాగుంది. రేవంత్ మళ్ళీ ఈ సంక్రాంతికి కూడా తన నటనతో సందడి చేసాడని చెప్పొచ్చు. చిరు తల్లి పాత్రలో కనిపించిన జరీనా వాహాబ్ రోల్ హుందాగా ఉంది. లిమిటెడ్ సీన్స్ లో కనిపించినా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ రోల్.
టెక్నికల్ :
దర్శకుడు అనీల్ రావిపూడి వరప్రసాద్ తో ఇంకొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మెగాస్టార్ లాంటి హీరో ని పెట్టుకుని సింపుల్ కథతో ఫన్ అందించి, ప్రేక్షకులని ఫుల్ ఎంటర్ టైన్ చేయటంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం బాగుంది. పాటలు , బీజీఎమ్ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. పార్టీ సాంగ్, డ్యూయెట్ , ఒక ఫోక్ సాంగ్ అని అన్ని ఉండేలా చూసుకున్నాడు భీమ్స్. హీరో ఎలివేషన్స్ లో బ్యాక్ గ్రౌండ్ లో రౌడీ అల్లుడు మ్యూజిక్ బాగుంది. సమీర్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. సినిమా టోగ్రాఫీ ఆకట్టుకుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ సూపర్ గా ఉంది. ఓ ప్రసాద్ పాటలో సమీర్ కెమెరా వర్క్ చాలా ప్లజంట్ గా ఉంది. తమ్మి రాజు ఎడిటింగ్ ఇంకా క్రిస్పీగా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
చిరంజీవి నటన
కామెడీ
బీజీఎమ్, సాంగ్స్
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ సైలెంట్
విలన్ ట్రాక్
ఫైనల్ వర్దిక్ట్ : సంక్రాంతి సందడి ‘మన శంకర వరప్రసాద్’ దే!



