చిత్రం: భర్త మహాశయులకు విజ్ఞప్తి
దర్శకత్వం: కిషోర్ తిరుమల
కథ – రచన: కిషోర్ తిరుమల
నటీనటులు: రవి తేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి, సునీల్ , సత్య, వెన్నెల కిషోర్, తారక్ పొన్నప్ప, సుధాకర్ , అజయ్ గోష్, రోషన్ , గెటప్ శ్రీను , మురళీ ధర గౌడ్ ,
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ళ
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
బ్యానర్: ఎస్ఎల్‌వి సినిమాస్
విడుదల తేదీ: 13 జనవరి 2026
రేటింగ్: 2.5/5
మాస్ మహారాజా రవి తేజ వరస డిజాస్టర్లతో సతమవుతున్నాడు. అయినా కానీ వరుస సినిమాలు చేస్తున్నాడు. రవి తేజకి ఇప్పుడు అర్జెంట్ గా ఒక్క హిట్ అవసరం. మిస్టర్ బచ్చన్ , మాస్ జాతర సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందించ లేకపోయాయి. 2026 ఎలా అయినా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు రవి తేజ. అందుకే ఈసారి సంక్రాంతి బరిలో నిలిచాడు. జనవరి 13 న థియేటర్స్ లో రిలీజ్ అయిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి ‘ సినిమా ఎలా ఉంది? రవి తేజ ఈ ఏడాది హిట్ కొట్టాడా ? ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
రామ సత్యనారాయణ (రవితేజ) ఒక వైన్ డిస్టీలరీ నడుపుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే స్పెయిన్‌లో మానస శెట్టి (ఆశికా రంగనాథ్)కు చెందిన వైన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థతో కొలాబరేషన్ కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ మానస పీఏ విందా అలియాస్ బెల్లం (సత్య) వల్ల ఆ డీల్ ఫెయిల్ అవుతుంది. అందుకే రామ సత్యనారాయణ స్పెయిన్ వెళ్తాడు. అక్కడ రామ్ కి మానస పరిచయం అవుతుంది. తాను పలానా అని చెప్పకుండా తన వర్క్ పూర్తి చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో మానస – రామ్ సత్యనారాయణ మధ్య చనువు ఏర్పడి బాగా క్లోజ్ అవుతారు. రామ్ కి పెళ్ళై భార్య బాలామణి (డింపుల్ హయతి) ఉంటుంది. భార్య ఉండగా మానస కి క్లోజ్ అవటంతో గిల్టీగా ఫీల్ అవుతాడు. సర్లే తెలిసో తెలియకో తప్పు చేశా, ఇంకో సారి మానస ని కలవకూడదు అనుకుంటాడు. కానీ అనూహ్యంగా మానస సత్యనారాయణ లైఫ్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. ఒక వైపు భార్య, ఇంకో వైపు ప్రియురాలు మధ్య నలిగిన రామ సత్యనారాయణ ఏం చేశాడు? మానస కి సత్యనారాయణ ఎందుకు దగ్గరయ్యాడు? బాలామణికి ఈ విషయం తెలిసిందా ? తరవాత పరిస్థితి ఏంటి ? మధ్యలో సుదర్శన్, సునీల్, లీల (వెన్నెల కిషోర్) పాత్రలేమిటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
ఏకపత్నీ వ్రతుడు లాంటి భర్త జీవితం లోకి యాక్సిడెంటల్‌గా ఇంకో మహిళ ఎంట్రీ ఇస్తే ఏం జరుగుతుంది? వివాహేతర సంబందాల వలన ఎదురయ్యే సమస్యలు ఈని ఇబ్బందులు తెచ్చి పెడతాయి అన్న పాయింట్ తో భర్త మహాశయులకు విజ్ఞప్తి కథ తెరకెక్కింది. ఈ సినిమాకి ప్రధాన బలం కామెడీ అని చెప్పొచ్చు. భార్య కాకుండా ఇంకొక మహిళ లైఫ్ లో ఉంటే మగవాడి కష్టాలు , తిప్పలు ఎలా ఉంటాయో చెప్తూ ఇప్పటికే చాలా కథలు వచ్చాయి. ఇది కూడా అలాంటి కథే. కాకపోతే ఈ మూవీలో రవి తేజ మాస్ యాక్షన్ , కామెడీ ఇంకొంచెం కలిసి వచ్చాయి. కథ పాతదే చెప్పే విధానం కూడా మారలేదు. రొటీన్ గా , రెగ్యులర్‌గానే ఉంది. ఫస్టాఫ్‌లో సత్య కామెడీ కొంత ప్లస్ అయింది.
సెకండాఫ్‌లో ఊహించని ట్విస్ట్ లు మలుపులు ఏమీ లేకపోవటం నిరాశగా మారింది. సెకండాఫ్‌లో సరైన కథ లేకపోవడంతో చెప్పిందే చెప్పి ల్యాగ్ ఎక్కువయ్యింది. ఈ మధ్య పాత సినిమా పాటలని యాడ్ చేసి కథ నడిపించటం ట్రెండ్ గా మారింది. భర్త మహాశయులకి విజ్ఞప్తి లో అదే ట్రెండ్ కంటిన్యూ చేసాడు దర్శకుడు. సీరియల్ సాంగ్స్ అయితే బాగా రీచ్ అవుతాయని హిట్ సీరియల్స్ కార్తీకదీపం, పిన్ని పాటలని తీసుకుని డ్యాన్సులు వేయించాడు. క్లైమాక్స్ కూడా ఆకట్టుకునేలా లేదు. ఇది పెద్ద కాన్సెప్ట్ కాకపోవటం తో రెండు గంటలు ఎంటర్ టైన్ చేయటానికి దర్శకుడు పడ్డ తిప్పలు తెలుస్తూనే ఉన్నాయి. ఇద్దరు భామల మధ్య ఇరుక్కున్న భర్తగా రవి తేజ నటన ఎక్సప్రెషన్స్, కమెడియన్లతో సినిమా పూర్తి చేసాడు దర్శకుడు కిషోర్ తిరుమల.
రవితేజ సునీల్ ట్రాక్, ‘కిరసనాయిల్’ ట్రాక్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. సెకండాఫ్‌లో జనరేటర్ సీన్ కూడా థియేటర్లో బాగా పండింది. ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి గ్లామర్ కూడా సినిమాకి కలిసి వచ్చింది. సంక్రాంతి బరిలో నిలిచే హడావుడిలో దర్శకుడు సినిమాని ఫాస్ట్ గా ముగించినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు. జబర్దస్త్ షో, సోషల్ మీడియా ట్రెండింగ్ మీమ్ కంటెంట్ పై కథ మొత్తం నడిపించి మమ అనిపించారు. రవి తేజ తరహా మాస్ యాక్షన్, ఎలివేషన్స్ ఏమీ లేకపోవటం నిరాశే . ఈ సినిమా కేవలం సోషల్ మీడియా ఫాలోవర్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ఎమోషన్స్ లేవు, కథ కాన్సెప్ట్ డెప్త్ గా ఫీలయ్యేలా లేదు. కొంచెం శ్రద్ద పెట్టి, సంక్రాంతి హడావుడి లేకుండా వచ్చి ఉంటే రవి తేజ హిట్ కొట్టి ఉండే వాడు అనిపిస్తుంది. సంక్రాంతికి ఎలాంటి కథతో వచ్చినా హిట్ గ్యారంటీ అని ప్రేక్షకులని తక్కువ అంచనా వేశారనిపిస్తుంది.
నటీ నటులు:
రామ సత్యనారాయణ పాత్రలో రవితేజ జీవించేసాడు. రవి తేజ కి ఈ పాత్రలు కొత్తేమీ కాదు. చాలా గ్యాప్ తర్వాత రవితేజ కామెడీ మూడ్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఆషికా రంగ నాథ్ గ్లామర్ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. ఈ మూవీ తరువాత ఆషికా క్రేజ్ పెరిగి ఛాన్సులు వచ్చే అవకాశముంది. డింపుల్ హయతి డాన్స్ సూపర్ గా ఉంది. నటన విషయంలో కూడా చాలా ఇంప్రూవ్ మెంట్ కనిపించింది. వెన్నెల కిషోర్, సత్య, సునీల్ కామెడీ ట్రాక్స్ సినిమాకి పెద్ద ఎసెట్ అని చెప్పొచ్చు. మానస అన్న రోల్ లో తారక్ పొన్నప్ప ఫర్వాలేదనిపించాడు. మిగతా పాత్రలు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్:
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన మ్యూజిక్ డీసెంట్‌గా ఉంది. మాస్ పాటలకి కేరాఫ్ అడ్రస్ అయిన భీమ్ ఈ సినిమాలో మాస్ సాంగ్ తో మరొకసారి క్రెడిట్ కొట్టేసాడు. భీమ్స్ కి ఈ సంక్రాంతి డబల్ ధమాకా అని చెప్పొచ్చు. ఒక్క రోజు గ్యాప్ లో రెండు సినిమాలతో వచ్చి హిట్ కొట్టాడు. మెగాస్టార్ తో మనశంకర్ వరప్రసాద్, రవి తేజ భర్త మహాశయులకి రెండు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. బీజీఎమ్ కూడా బాగా సెట్ అయింది. మొత్తానికి భీమ్స్ కి బ్లాక్ బస్టర్ పొంగల్ అని చెప్పాలి. దర్శకుడు కిషోర్ తిరుమల గత కథల్లా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయినా పరవాలేదనిపించుకున్నాడు. ప్రసాద్ మూరెళ్ల తన కెమెరా వర్క్ తో ఫారెన్ లొకేషన్స్ ని అద్బుతంగా ప్రజంట్ చేసాడు. కంటెంట్ లేకున్నా సీన్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ పై ఇంకొంచెం శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్
రవి తేజ నటన
ఆషికా గ్లామర్
భీమ్స్ సంగీతం
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
ఎమోషన్స్ లేకపోవటం
సాగదీత సీన్స్
ఫైనల్ వర్దిక్ట్: సిల్వర్ స్క్రీన్ జబర్దస్త్ షో “భర్త మహాశయులకు విజ్ఞప్తి”.



