HomeMovie News Teluguఢిల్లీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్..!

ఢిల్లీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్..!

గ్లోబల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వ్యక్తిగత హక్కులను కాపాడుకునేందుకు న్యాయపరమైన చర్యలు చేపట్టారు. తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్‌ను ఉపయోగించకూడదని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సెలబ్రిటీల క్రేజ్‌ను ఉపయోగించుకుని కొన్ని సంస్థలు వారి అనుమతి లేకుండానే ప్రకటనలు లేదా ప్రచారాలు చేయడం తరచూ జరుగుతోంది. దీని వల్ల వారి వ్యక్తిగత బ్రాండ్ విలువ దెబ్బతినడమే కాకుండా, వారు సంబంధం లేని విషయాల్లో కూడా వారి పేరు వినిపించే పరిస్థితి ఏర్పడుతోంది.

గతంలో కూడా అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అనిల్ కపూర్ వంటి ప్రముఖులు తమ వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం కోర్టులను ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ దాఖలు చేసిన ఈ సివిల్ పిటిషన్‌పై జస్టిస్ తుషార్ రావు గెడెల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా వాయిస్ మార్చడం, అనుమతి లేకుండా ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రకటనలకు వాడుకోవడం వంటి అంశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ కేసుపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఇప్పుడు సినీ పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు ఇది కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular