HomeTeluguనాగబంధం మూవీ రివ్యూ & రేటింగ్

నాగబంధం మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం: నాగబంధం
దర్శకత్వం: అభిషేక్‌ నామా
కథ – రచన: అభిషేక్‌ నామా

నటీనటులు: విరాట్‌ కర్ణ, నభా నటేశ్‌, ఐశ్వర్య మేనన్‌, దక్ష నగర్కర్‌, మహేశ్‌ మంజ్రేకర్‌, జగపతిబాబు, మురళీ శర్మ తదితరులు

నిర్మాతలు: కిషోర్‌ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి.

సంగీతం: జునైద్‌ కుమార్‌, అభి
సినిమాటోగ్రఫీ: సుందర్‌ రాజన్‌ ఎస్‌
ఎడిటింగ్‌: ఆర్‌.సి. ప్రణవ్‌

బ్యానర్: ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్

విడుదల తేదీ: 03 జూలై 2026

‘పెదకాపు’ చిత్రంతో హీరో గా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు విరాట్‌ కర్ణ. ఇప్పుడు ‘నాగబంధం’ అనే పాన్ ఇండియా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. నాగబంధం మూవీ మొదటి నుంచి ఆడియన్స్ లో ఉత్సుకత పెంచింది. టీజర్, ట్రైలర్ తో మరిన్ని అంచనాలను పెంచింది. పురాతన రహస్యాలు, నాగబంధం సంప్రదాయంతో ఈ కథను విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దినట్లు తెలిసింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన నాగ బంధం మూవీ ఎలా ఉంది. ప్రేక్షకులని ఎంతవరకు అలరించింది? దర్శకుడు అభిషేక్‌ నామా టేకింగ్‌ ఎలా ఉంది? అన్నది ఈ రివ్యూలో చూద్దాం .

కథ :

ఈ సినిమా కథ 1756-1962 నేపథ్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ సాగుతుంది. ప్రముఖ ఇండియన్ ఆర్కియాలజిస్ట్‌ ప్రభాకర్‌(జగపతి బాబు) తన కెరీర్‌లో ఎన్నో రహస్యాలు కనుగొన్నా నాగబంధం రహస్యాన్ని మాత్రం కనిపెట్టలేకపోతాడు. దీని కోసం తన శిష్యులు టెస్లా, అలీ (రిషబ్‌ సాహ్నీ) పరిశోధన చేస్తూ హిమాలయాలకు వెళ్తారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా బంధించబడి ఉన్న బైరాగి (గరుడ రామ్‌) మంత్ర శక్తితో అలీ గతాన్ని గుర్తు చేసి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ప్రపంచాన్ని జయించాలంటే నాగ బంధాన్ని విడిపించాలని అందుకోసం బ్రహ్మ కమలం తీసుకురావాలని బైరాగి ఆలీని ఆదేశిస్తాడు. అలీ తన అనుచరులతో బ్రహ్మకమలం కోసం వెతుకుతూ, ఈ క్రమంలో అడ్డొచ్చిన వాళ్లను, బ్రహ్మ కమలం వివరాలు తెలిసిన వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. చివరకు తాను వెతుకుతున్న బ్రహ్మకమలం శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో స్వామివారి నాభిలో ఉండే పద్మంలో ఉందని తెలిసి, అది తీసుకురావటానికి ఓ ప్లాన్‌ వేసి ఆలయం నుంచి తీసుకు వస్తుండగా భైరవకోన సమీపంలో సముద్రంలో పడిపోతుంది. దాని కోసం అలీ మనుషులు తులసీవనం గ్రామానికి వెళ్తారు. అక్కడ రుద్ర(విరాట్‌ కర్ణ) సహాయంతో పడవలో భైరవకోనకు బయలుదేరుతారు. ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులేంటి? చివరికి ఆ స్వర్ణ కమలం అలీ మనుషులకు దొరికిందా? లేదా? రుద్ర అలీ కి సహాయం చేశాడా లేదా? బ్రహ్మకమలానికి రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? రుద్ర చెల్లి మాసస(సోనియా సింగ్‌) చావుకు కారణం ఎవరు? ఏంటి? పార్వతి(నభా నటేష్‌) ఎవరు? రుద్రతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? అసలు 1956లో ఏం జరిగింది? ముస్లిం రాజుతో కలిసి భైరాగి పన్నిన కుట్ర ఏంటి? అసలు నాగబంధం నేపథ్యం ఏంటి?చివరకు బైరాగి నాగబంధాన్ని విడిపించాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

స్టార్ హీరో, డైరక్టర్ లెక్కలు ఎప్పుడో మారిపోయాయి. కేవలం కంటెంట్ తో ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు. కథ నచ్చితే పట్టం కడుతున్నారు. నాగబంధం సినిమాకి కూడా ఇవే వర్తిస్తాయి. కర్ణ స్టార్ హీరో కాదు రెండో సినిమాకి 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా కథతో వచ్చాడు. కేవలం కథపై నమ్మకంతో మేకర్స్ కూడా ఇంత బడ్జెట్ పెట్టారు. టీజర్, ట్రైలర్ తోటే భారీ అంచనాలు పెరిగాయి. అనంత పద్మనాభ స్వామి బ్యాక్ గ్రౌండ్ తో కథ అల్లుకోవటంతో డివోషనల్ థ్రిల్లర్ అని జనాల్లో నమ్మకం కుదిరింది. ఫస్ట్ హాఫ్ 1962లో సాగుతుంది. బ్రహ్మకమలం, నాగబంధం కోసం అలీ గ్యాంగ్ చేసే ప్రయత్నాలు, రుద్ర కుటుంబం గూర్చి పరిచయం తో కథ నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ తో యాక్షన్, ఎమోషన్స్ తో కూడిన ట్విస్ట్ ఇచ్చి, నెక్స్ట్ రుద్ర ఏం చేస్తాడన్న క్లారిటీ ఇచ్చారు. సెకండ్ హాఫ్‌లో రుద్ర బ్రహ్మకమలం వెతుక్కుంటూ వెళ్తూ తెలుసుకున్న నిజాలు, ఊహికందని ట్విస్టులు బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో కథ 1756 లోకి మారి, మళ్ళీ బ్రహ్మకమలం చుట్టూ తిరుగుతుంది. క్లైమాక్స్‌లో డివోషనల్ ఎలివేషన్ తో యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నాయి. రంగనాథ స్వామి విగ్రహం తిరువనంతపురం పద్మనాభ స్వామిని గుర్తు చేస్తుంది. ఆలయం డిజైన్ కూడా శ్రీరంగం స్టైల్‌లో ఉండటం ఆకట్టుకుంటుంది.

ఫస్ట్ హాఫ్‌లో కథ సాగదీసినట్టు అనిపించింది. హీరో బంధువులుగా వచ్చే అనసూయ ఫ్యామిలీ ట్రాక్ కథకు పెద్దగా ఉపయోగం లేదు. సీరియస్ మూడ్ లో వచ్చిన రొమాంటిక్ సాంగ్స్ వర్కౌట్ అవలేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బలంగా లేవు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నాగబంధం, బ్రహ్మకమలం వెనక ఎవరు ఉన్నారన్న ట్విస్టులు బాగున్నాయి. 1756 సీన్స్ స్క్రీన్ మీద ఆకట్టుకునేలా ఉన్నాయి. సనాతన ధర్మం గురించి ప్రస్తావించినా కథలో ఆ ఎఫెక్ట్ లేదు. ప్రమోషన్స్‌లో ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ అని ప్రమోట్ చేయటం తో ట్రెజర్ హంట్ సినిమా అని ఆడియన్స్ ఊహించుకొని వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. అసలు నాగబంధం వెనక ఏముందన్న విషయం చెప్పకుండా సినిమా పూర్తి అవటం నిరాశ మిగులుస్తుంది. పార్ట్ కోసం అన్నట్టు చాలా ప్రశ్నలు మిగిల్చారు. చిరంజీవి ‘అంజి’ సినిమా కొంచెం గుర్తుకు వస్తుంది.

నటీనటులు :

పెదకాపు సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన విరాట్ కర్ణ రుద్ర పాత్రలో బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడనే చెప్పాలి. సీనియర్ యాక్టర్ తరహాలో ఉంది విరాట్ కర్ణ నటన. ఎంతో అనుభవం ఉన్న నటుడిగా తన పాత్రలో ఒదిగిపోయాడు. పార్వతి పాత్రలో నభ నటేష్‌ నటన మెప్పించింది. కథలో కీలకమైన క్యారెక్టర్‌ లో నభా నటేష్ నటించింది. దక్ష నగార్కర్, ఐశ్వర్య మీనన్, అనసూయ పాత్రల స్కోప్ తక్కువున్నాగుర్తుండిపోయే పాత్రలు. అబ్దుల్లా రిషబ్ సాహ్నీ, ప్రభాకర్‌గా జగపతిబాబు పాత్రలు ఈ సినిమాకు కీలకం. మిగతా నటీ నటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నీకల్ :

టెక్నీకల్ టీమ్ ఈ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. సౌంద‌ర్‌రాజ‌న్ సినిమాటోగ్రఫీ కథకి ప్లస్ అయ్యింది. జునైద్‌కుమార్‌, అభి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాట‌లు బాగున్నాయి. పెళ్లి పాటల చిత్రీకరణ గ్రాండియ‌ర్‌గా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన హార్డ్ వర్క్ స్క్రీన్ పై కనిపిస్తోంది. శ్రీరంగ‌పురం దేవాల‌యం, విరాటపురుషాల‌యం అన్నీ సెట్ లు రాజసంగా ఉన్నాయి. పాముల విజువ‌ల్స్, జ‌గ‌ప‌తిబాబు హెలికాప్ట‌ర్ కూలిపోయే సీన్స్ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో చాలా న్యాచురల్ గా కుదిరాయి. ఎడిటింగ్ పై ఇంకొంచెం శ్రద్ద పెట్టి ఉంటె బాగుండేది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి .

ప్లస్ పాయింట్స్

నటీనటులు
టెక్నికల్
పాటలు

మైనస్ పాయింట్స్

సాగదీత సీన్స్
ఎమోషన్స్ మిస్సింగ్
కథ కథనం

You May Like This
- Advertisment -spot_img

Most Popular