చిత్రం: ఓ..! సుకుమారి
దర్శకత్వం: భరత్ దర్శన్
కథ – రచన: భరత్ దర్శన్
నటీనటులు: తిరు వీర్, ఐశ్వర్య రాజేష్, మురళీధర్ గౌడ్, విష్ణు ఓయి (మ్యాడ్ ఫేమ్), ఝాన్సీ, ఆమని, ఆనందకోట జయరామ్ తదితరులు
నిర్మాతలు: మహేశ్వర రెడ్డి
సంగీతం: భరత్ మంచిరాజు
సినిమాటోగ్రఫీ: సీహెచ్. కుశేందర్
ఎడిటర్: శ్రీ వరప్రసాద్
బ్యానర్: గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్
విడుదల తేదీ: 17 జూలై 2026
ఐక్లిక్ న్యూస్ రేటింగ్: 2/5
తిరువీర్ మొదటి నుంచి విలక్షణ కథల్ని ఎంచుకుని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తిరువీర్ కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ఓ సుకుమారి మూవీలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్యా రాజేష్ కూడా నటనకి ఆస్కారమున్న కథల్ని ఎంచుకుంటూ పాన్ ఇండియా వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఇద్దరు కలిసి ఓ !సుకుమారి మూవీలో నటించటం తో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ శుక్రవారం థియేటర్స్ లో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందో? తిరువీర్, ఐశ్వర్య జోడీ తెరపై ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
నరాల యాదగిరి (తిరువీర్) కి తన ఊరికి సర్పంచ్ కావాలని కోరిక. అయితే యాదగిరికి తన తాత ఆస్తి 80 కోట్ల వస్తుంది. కానీ ఆ ఆస్తి యాదగిరికి దక్కాలంటే పెళ్లి చేసుకోవాలన్న షరతు పెడతాడు తాత. చేసేదేం లేక యాదగిరి పెళ్లి ప్రయత్నాల్లో పడతాడు. ఒకరోజు పెళ్లి చూపులకి వెళ్లి దామిని (ఐశ్వర్య రాజేష్)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ దామిని అంటే ఆ ఊరి జనాలకి చాలా భయం. ఎలాగయినా ఆ ఊరినుంచి ఆమెని తొందరగా పంపేయాలని తెగ ఆరాటపడతారు. ఇలాంటి టైం లో యాదగిరి పెళ్లి చూపులకి రావటం, దామినిని ఇష్టపడటంతో దామినికి చెందిన ఒక రహస్యాన్ని దాచి పెళ్లి చేసేస్తారు. ఫస్ట్ నైట్ రోజు యాదగిరికి అసలు నిజం తెలిసి అవాక్కవుతాడు. అసలు దామిని సమస్య ఏంటి? ఊరి వాళ్లంతా ఆమెను చూసి ఎందుకు భయపడతారు? చివరకు యాదగిరికి తాత ఆస్తి దక్కిందా? లాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే ‘ఓ..! సుకుమారి’ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హీరోయిన్ ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది అన్న కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఫుల్ కామెడీ & ఎమోషనల్ అని ట్రైలర్ ద్వారా అర్థమైంది. ఓ పిల్లల కిడ్నాప్ సీన్ తో కథ ఓపెన్ అవుతుంది. అక్కడ విలన్ తో పాటు, దామిని పాత్ర కూడా ఎంట్రీ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఆ విలన్ మళ్ళీ కనిపించడు. నెక్స్ట్ యాదగిరి ఫ్యామిలీ పరిచయం ఉంటుంది. ఈ సీన్ లో కామెడీ ట్రై చేసినా వర్కవుట్ అవ్వలేదు. దామిని పాత్ర, ఆ షాక్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన సీన్స్ కాస్తా నవ్విస్తాయి. యాదగిరి దామినిని చూసిన దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది. పెళ్లి తర్వాత శోభనం సీన్ దాకా ఆ ఊరి వాళ్ళు షాక్ ఎఫెక్ట్ ని దాచిపెట్టడానికి చేసే ప్రయత్నాలు కామెడీగా ఉన్నాయి. అలాగే ప్రీ ఇంటర్వెల్ కూడా ఫుల్ గా నవ్విస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో శోభనం రోజు యాదగిరి దామినిని ముట్టుకుంటే షాక్ కొట్టడంతో సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో భార్య భర్త మధ్య వచ్చే లవ్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, తో పాటు యాదగిరి సర్పంచ్ అయ్యే ప్రయత్నాలు ఉంటాయి. ఇవన్నీ ఎంటర్టైన్ చేయవు సరి కదా బోరింగ్ గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ లెన్త్ ఎక్కువ అయింది. దామినికి ఉన్న సమస్య గూర్చి చెప్పిన ఫ్లాష్ బ్యాక్ బాగానే వర్కౌట్ అయింది. క్లైమాక్స్ లో ఆ షాక్ వల్ల జరిగిన మంచి కూడా జస్టిఫికేషన్ గా ఉంది. సర్పంచ్ ఎన్నికలు, పదవి గురించి చాలా కథ నడిపించినా చివర్లో ఏమి క్లారిటీ ఇవ్వకుండానే వదిలేసారు. ఇది నిజంగానే బయట ఓ ఇద్దరికి ఉన్న సమస్య లా చూపించి ఆడియన్స్ ని లాజికల్ గా సంతృప్తి పరిచే ప్రయత్నం చేసారు. అంతే కాదు పార్ట్ 2 కూడా ఉందని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు . మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కొన్ని సీన్లలో తెలంగాణ యాస మాట్లాడుతుంది, మరికొన్ని సార్లు నార్మల్ గా మాట్లాడుతుంది. ఉఛ్ అంటూ చెప్పిన మేనరిజమ్ డైలాగ్ కూడా ఆడియన్స్ ని కనెక్ట్ అవదు. ఫైనల్ గా ఓ !సుకుమారి ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు.
నటీనటులు:
తిరువీర్ మరోసారి తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన నటన చాలా న్యాచురల్ గా ఉంది. భార్యా బాధితుడైన భర్త పాత్రలో మరోసారి తిరువీర్ మేనరిజంతో మెప్పించాడు. ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో తన నటనతో మరోసారి ఆకట్టుకుంది. దామిని గా భిన్నమైన పాత్ర పోషించింది. నటనకి ఆస్కారమున్న పాత్ర పడింది. ఆమని, క్రాంతి బలివాడ, గవిరెడ్డి శ్రీనివాస్, జీవన్, మురళీధర్ గౌడ్ లు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్:
దర్శకుడు భరత్ దర్శన్ రాసుకున్న కథలో పాయింట్ బాగున్నా తెరపై ఆవిష్కరించటం లో ఫెయిల్ అయ్యారు. ఎంటర్టైన్ చేయలేదు. స్క్రీన్ ప్లే ఆసక్తిగా లేదు. ఇంటర్వెల్ కంటే ముందు క్లైమాక్స్, కీ సీన్స్ అన్నీ ప్రేక్షకులు ఊహకి అందేలా ఉన్నాయి. కెమెరా వర్క్ గొప్పగా లేదు. ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ద పెట్టి ఉంటె బాగుండేది. భరత్ మంచిరాజు అందించిన సంగీతం పరవాలేదనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకి ప్లస్ అయింది.
ప్లస్ పాయింట్స్
తిరువీర్, ఐశ్వర్య రాజేష్
సంగీతం
మైనస్ పాయింట్స్
బోరింగ్ సీన్స్
ఆకట్టుకొని స్క్రీన్ ప్లే
ఫైనల్ వర్దిక్ట్ : రొటీన్ కామెడీ డ్రామా ” ఓ ! సుకుమారి “





