HomeMovie News Teluguజన నాయగన్ థియేటర్ కౌంట్ తెలిస్తే మతి పోవాల్సిందే..!

జన నాయగన్ థియేటర్ కౌంట్ తెలిస్తే మతి పోవాల్సిందే..!

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలుత ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాలతో విడుదల వాయిదా పడింది.

విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం కావడంతో ‘జన నాయగన్’ పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను 30కి పైగా దేశాల్లో సుమారు 7,000 నుంచి 8,000 స్క్రీన్‌లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే, ఇది విజయ్ కెరీర్‌లోనే కాకుండా తమిళ సినీ పరిశ్రమ చరిత్రలోనే అత్యంత భారీ విడుదలల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, మమిత బైజు కీలక పాత్రలో కనిపించనున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular