HomeMovie News Telugu'అఖండ 2' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

‘అఖండ 2’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే శుభవార్త వచ్చింది. అందరూ ఎదురుచూసినట్లుగానే అఖండ 2 సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ డిసెంబర్ 12వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. అంతేకాదు డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్ షోలు ఉంటాయని కూడా స్పష్టం చేశారు. త్వరలోనే టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని తెలిపారు. ఈ మేరకు కొత్త రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

ఈ ప్రకటనతో నందమూరి బాలయ్య అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కాగా, అఖండ 2 విడుదల వాయిదా పడటం, కొత్త తేదీలపై స్పష్టత ఇవ్వడానికి చిత్ర బృందం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ప్రెస్ మీట్‌కు బాలయ్య కూడా హాజరయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కొన్ని ఆర్థిక కారణాల వల్ల ముందుగా డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సిన అఖండ 2 వాయిదా పడింది. తాజాగా 14 Reels Plus అధికారికంగా కొత్త తేదీని ప్రకటించడంతో అభిమానుల్లో మళ్లీ జోష్ తిరిగి వచ్చింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular