HomeMovie News Teluguఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి గురూజీ ?!

ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి గురూజీ ?!

వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. యాక్షన్, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా సాగే ఎంటర్‌టైనర్‌ ఇది.

ఈ సినిమాకి ‘బంధు మిత్రుల అభినందనలతో’ అనే పేరుతో పాటు మరో రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వినిపించింది. కానీ త్రివిక్రమ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ చిత్రానికి టైటిల్ ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్ ఫిక్స్ ఇచ్చారు. త్రివిక్రమ్ కు ‘అ’.. సెంటిమెంట్. అతడు, అ ఆ.. అరవింద సమేత, అల వైకుంఠపురంలో.. ఇప్పుడా వరుసలో ఆదర్శ కుటుంబం చేరింది. చాలా మంచి తెలుగు టైటిల్ ఇది.

ఆదర్శ కుటుంబం చాలా పాపులర్ టైటిల్. అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత ప్రధాన పాత్రల్లో 1969 వచ్చిన ఆదర్శ కుటుంబం మంచి విజయాన్ని సాధించింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వం గౌరవించింది. అలాంటి వింటేజ్ క్లాసిక్ టైటిల్ ని తీసుకున్నారు త్రివిక్రమ్.

కాకపొతే ఇక్కడ ట్విస్ట్ వుంది. ఈ సినిమాకి AK47 అంటే ట్యాగ్ లైన్ కూడా వుంది. ఇంటి నెంబ‌రు 47 అనేది ఇంకో కొసమెరుపు. టైటిల్ ఫాంట్ లో ‘కుటుంబం’కు రక్తాన్ని జోడించారు. ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో జానర్ మార్చారు త్రివిక్రమ్. ఇందులో కావాల్సిన యాక్షన్థ్రిల్ ఉంటాయని హింట్ ఇచ్చారు.

వెంకటేశ్‌ ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’లకు త్రివిక్రమ్‌ రైటర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే వెంకీ నటిస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular